మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 22, 2020 , 23:59:07

మధిరలో తొలుత మందకొడిగా..

మధిరలో తొలుత మందకొడిగా..


మధిర, నమస్తేతెలంగాణ: మధిర మున్సిపాలిటీలో బుధవారం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. మధిర మున్సిపాలిటీ పరిధిలో మధిర, అంబారుపేట,  ఇల్లెందులపాడు, మడుపల్లి, దిడుగుపాడు గ్రామాలు ఉండగా మొత్తం 22 వార్డులుగా విభజించారు. ఈ 22 వార్డుల్లో 67 మ ంది ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికలు నిర్వహించేందుకు 44 బూత్‌లను  ఏర్పాటు చేశారు. ఆయా బూత్‌లలో విధులు నిర్వర్తించేందుకు పీవోలు 56 మంది, ఏపీవోలు 57 మంది, ఓపీవోలు 162 మంది కలిపి మొత్తం 275 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కో బూత్‌లో ఒక పీవో, ఒక ఏపీవో, ముగ్గురు ఓపీవోలు ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించారు. దివ్యాంగ ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా  కేంద్రాల వద్ద ర్యాంపులు నిర్మించడంతో పాటు, వీల్‌చైర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దివ్యాంగుల రవాణా కోసం ఆటోలను ఏర్పాటు చేశారు.  యువత, వృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డల తల్లులు సైతం ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 9 గంటలకు 13.51  శాతం పోలింగ్‌ నమోదు కాగా 3,278 ఓట్లు పోలయ్యాయి. 11 గంటలకు 35.98 శాతం నమోదు కాగా 8,729 ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 1 గంటలకు 57.35 శాతం పోలింగ్‌ నమోదు కాగా 13,907 ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు  72. 14 శాతం పోలింగ్‌ నమోదు కాగా 17,494 ఓట్లు పోలయ్యాయి. 


సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసే సరికి 82.56 శాతం పోలింగ్‌ నమోదైంది.  గణాంకాలు పరిశీలించినైట్లెతే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉద యం మందకొడిగా పోలింగ్‌ సాగినప్పటికీ మధ్యాహ్నం నుంచి పోలింగ్‌ శాతం పుంజుకుంది.మధిర పట్టణంలోని ప్రభుత్వ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన(9వ వార్డులో) పోలింగ్‌బూత్‌లో మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క దంపతులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్‌ సరళిని పర్యవేక్షించారు. ఖమ్మం కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ తఫ్సీర్‌ఇక్బాల్‌, అడిషనల్‌ డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ దాసరి మురళీధర్‌తో కలిసి మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడు పల్లి గ్రామంలోని హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన 5వ వార్డు పోలింగ్‌ బూత్‌ను, మధిర పట్టణంలోని ఎన్నెస్పీ  గెస్ట్‌హౌస్‌లో  ఏర్పాటు చేసిన 10వ వార్డుకు సంబంధించిన పోలింగ్‌బూత్‌ను పరిశీలించారు. పోలింగ్‌ బూత్‌ వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు వివరాలను అడిగి తెలుసుకున్నా రు.ఈ కార్యక్రమంలో ఏసీపీ రామోజీరమేశ్‌, సీఐలు వేణుమాధవ్‌, కరుణాకర్‌, మధిర రూరల్‌ ఎస్సై లవన్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల పరిశీలకులు, ఐటీడీఏ పీవో గౌతమ్‌ మధిర పట్టణంలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన 20, 21 పోలింగ్‌బూత్‌లను పరిశీలించారు. logo
>>>>>>