మంగళవారం 07 ఏప్రిల్ 2020
Khammam - Jan 22, 2020 , 00:13:50

సాగుకు సర్కారు ‘సాయం’..

సాగుకు సర్కారు ‘సాయం’..
  • -యాసంగికి రైతుబంధు నిధులు విడుదల
  • -మరికొద్ది రోజుల్లోనే రైతుల అకౌంట్‌లో జమ
  • -ఈ ఏడాది నుంచే ఎకరానికి రూ.10వేలు
  • -2.75 లక్షల మంది రైతులకు లబ్ధి
  • -ముమ్మరంగా సాగుతున్న యాసంగి పనులు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం నిధులు విడుదలయ్యాయి.. మరికొద్ది రోజుల్లోనే లబ్ధిదారుల  అకౌంట్లలో నగదు జమ కానుంది.. ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ. 5వేలు ఇవ్వనున్నారు..  జిల్లా వ్యాప్తంగా 2.75లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.. సాగు పనులు ప్రారంభించిన రైతులకు సమయానికి పెట్టుబడి అందడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు..

ఖమ్మం వ్యవసాయం : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు శుభవార్త అందించింది. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి సంబంధించి యాసంగి పెట్టుబడి కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ. 5,100 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయానికి రైతుల జాబితా అందనుంది. అనంతరం అధికారులు రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లు పరిశీలించిన అనంతరం తిరిగి దఫాల వారీగా రైతుల జాబితాను రాష్ట్ర వ్యవసాయశాఖకు అందజేయనున్నారు. అనంతరం  రైతుల అకౌంట్లో ఎకరానికి రూ.5వేల చొప్పున నిధులు జమకానున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం 2020 సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి పంపిణీకి రంగం సిద్ధం అయ్యింది. సోమవారం రాత్రి రాష్ట్ర వ్యవసాయశాఖ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. 2018 సంవత్సరానికి గాను రెండు సీజన్‌లలో కలిపి ఎకరానికి రూ.8వేలు రైతులకు అకౌంట్టలో వేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి వానాకాలం, యాసంగికి కలిపి ఎకరానికి రూ.10వేల చొప్పున అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే గత ఏడాది వానాకాలం సీజన్‌లో పెరిగిన పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లో సొమ్ము జమ చేశారు. అందులో భాగంగానే నేటి వరకు 2.08 లక్షల మంది రైతులకు గాను రూ.226.53 కోట్లను రైతులకు అందజేశారు. మిగిలిన రైతులకు ఈ నెల చివరి లోపు వారి అకౌంట్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పనులు ముమ్మరం కావడంతో అందుకు అవసరమైన పెట్టుబడి సైతం సకాలంలో అందించేందుకు గాను టీ సర్కార్‌ నిధులు విడుదల చేసింది. ఈనెల చివరిలోగా యాసంగి సాయం రైతులకు అందించేందుకు గాను వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. అన్నదాతల అవసరాలను గుర్తించి సకాలంలో నిధులు విడుదల చేయడం పట్ల పలువురు రైతు సంఘం నాయకులు, రైతు సమన్వయ సమితి బాధ్యులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రైతులకు ఇచ్చిన హామీ మేరకు..

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చినైట్లెంది. పంటల పెట్టుబడితో అప్పుల పాలవుతున్న రైతన్నలకు ప్రభుత్వం సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పటికే మూడు సీజన్‌లు పూర్తి చేసుకుంది. 2018 సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్‌లలో కలిపి జిల్లావ్యాప్తంగా దాదాపు 2.75 లక్షల మంది రైతులకు గాను రూ.510 కోట్లు పంపిణీ చేశారు. అదే విధంగా ఈ సంవత్సరం వానాకాలం సీజన్‌లో ఎకరానికి రూ.5వేల చొప్పున 2.08 లక్షల మంది రైతులకు రూ.226.53 కోట్లు అందించింది ప్రభుత్వం. 2019 వానాకాలం సీజన్‌లో కొన్ని సాంకేతిక కారణాల వలన కొద్దిమంది రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. సదరు రైతులకు సైతం యాసంగి పెట్టుబడికి ముందే ఆయా రైతుల అకౌంట్లో సొమ్ము జమ అయ్యే అవకాశం ఉంది. వానాకాలం సీజన్‌లో గుర్తించిన రైతుల సంఖ్య ప్రకారం దాదాపు 2.75 లక్షల మంది రైతులకు గాను యాసంగి సీజన్‌లో సైతం మరో రూ.345 కోట్లు పంపిణీ జరగనుంది. గత రెండు సంవత్సరాల నుంచి బ్యాంక్‌లు పంట రుణాలు రైతులకు అందివ్వలేక పోయినప్పటికీ ప్రభుత్వమే పెట్టుబడి సాయం చేయడంతో వారికి అప్పుల బాధలు తొలిగినైట్లెంది.
 

ముమ్మరంగా యాసంగి పనులు..

సాగర్‌ ఆయకట్టు ప్రాంతం చాలా ఏళ్ల తరువాత కళకళలాడుతుంది. సాగర్‌ కాల్వ ద్వారా నిరంతరాయంగా నీరు వదలడంతో యాసంగి పంటలను రైతులు ఉత్సాహంతో చేపట్టారు. జిల్లాలో దాదాపు 16 మండలాలు సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో ఉన్నాయి. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా సుమారు 51,769 హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు జరగవచ్చని వ్యవసాయశాఖ అంచన వేసింది. అందులో భాగంగానే ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 49,817 హెక్టార్లలో  సాగు జరిగి 96శాతం సాగు జరిగినైట్లెంది.logo