మంగళవారం 07 జూలై 2020
Khammam - Jan 20, 2020 , 02:17:26

మధిరను మధురంగా తీర్చిదిద్దుకుందాం..

మధిరను మధురంగా తీర్చిదిద్దుకుందాం..
  • - అభివృద్ధికి చిరునామా టీఆర్‌ఎస్‌
  • - అధికారంలో లేని పార్టీలను గెలిపిస్తే ఒరిగేదేమి ఉండదు..
  • - సేవ చేసే నాయకుడిని ప్రజలు మరిచిపోరు
  • - కూటమికి ఓటేస్తే మురిగిపోయినట్లే ..
  • - మడుపల్లి రోడ్‌షోలో మంత్రి పువ్వాడ,మాజీ ఎంపీ పొంగులేటి

మధిర, నమస్తేతెలంగాణ, జనవరి19: తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర  పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సార ధ్యంలో మధిర మున్సిపాలిటీని మధురమైన మధిరగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో 5, 6, 7 వార్డుల్లో ఆయన మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొం డబాల కోటేశ్వరరావు, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌ రాజు, రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, ఆయా వార్డుల టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులతో కలిసి రోడ్‌షో, ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉందని  పేర్కొన్నారు. అరవై ఏళ్ల పాటు పాలించిన పార్టీలు చేయని అభి వృద్ధిని రాష్ట్రంలో కేవలం 5 సంవత్సరాల లోపు టీఆ ర్‌ఎస్‌ ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు. అభివృద్ధికి చిరునామా టీఆర్‌ఎస్‌ పార్టీ అని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉందని, సీఎం కేసీ ఆర్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో మధిర మున్సిపాలిటిని మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశాన్ని ప్రజలు జార విడుచుకోవద్దని కోరారు.

ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్య ర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి మధిర మున్సిపాలిటీలో గులాబీజెండా ఎగురవేయాలని తెలిపారు. మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా ట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పరిపాలనలో అభివృద్ధి జరు గుతుందని వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజును గెలిపించాలని ప్రాదేయపడినప్పటికీ దురదృష్టవశాత్తు  గమ్యాన్ని చేరలేకపోయామని పేర్కొ న్నారు. ఇతర పార్టీలను గెలిపిస్తే ఒరిగేదేమిటి? సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సారధ్యంలో నడుస్తున్న టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే జరిగేది ఏమిటని..? అనే విషయాన్ని ప్రతిఒక్కరూ ఆలోచించాలని పేర్కొన్నారు. ఇతర పార్టీలకు ఓటు వేస్తే మురిగిపోయినట్లేనని, రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేస్తే మధిర మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకొనే అవకాశం కలుగుతుందన్నారు. మడుపల్లి గ్రామాన్ని మధిర మున్సిపాలిటీలో కలిపింది టీఆర్‌ఎస్‌ నాయకులు కాదని, కాంగ్రెస్‌ పార్టీ ప్రబుద్ధులని తెలి పారు. మడుపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి విడదీయాలని ప్రజలు కోరడం జరిగిందని, వారి కోరిక మేరకు ముమ్మరంగా ప్రయత్నాలు చేయడం జరిగింద ని, సాంకేతిక కారణాల వల్ల ఆ పని నిలిచిపోయిందని తెలిపారు.

ఈ విలీనం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నెయ్యి పోసి నిప్పు పెట్టిందని, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను బదనాం చేయాలని చూస్తుందన్నారు. కూటమి ఏదో ఒకటి చేసి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవాలని తహతహలాడుతుందని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే వారు ఎవరిదగ్గరకు వెళ్లి ప్రజల సమస్యలు తీర్చగలుగుతారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల కోరికలు తీర్చేందుకు  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజు, తాను ఉన్నామని తెలిపారు. ఎన్నికల్లో డబ్బులు చిమ్మి గెలవాలని కూటమి కు యుక్తులు పన్నుతుందని, కానీ వారు ఆటలు సాగవన్నారు. ప్రజ ల్లో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి పరితపించే వ్యక్తి వేల్పుల బుజ్జి అని, సేవ చే సుకునే నాయకుడిని ప్రజలు మరిచిపోరని, దానికి నిదర్శనం వేల్పుల బుజ్జి అని పేర్కొన్నారు. అంద రూ ఐక్యతతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి మంత్రికి కానుకగా ఇవ్వాలని కోరారు. ప్రచారానికి వచ్చిన వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బంజారాల నృత్యంతో ఘనస్వాగ తం పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఫౌండర్‌మెంబర్‌ బొమ్మెర రామ్మూర్తి, ఆర్‌జేసీ కృష్ణ, 5, 6, 7 వార్డుల అభ్యర్థులు, భరత్‌ వి ద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి, వేల్పుల శ్రీనివాసరావు(బుజ్జి), మేడికొండ కిరణ్‌, రేగళ్ల సాంబశివరావు, శీలం వీరవెంకటరెడ్డి, బత్తుల మురళీ, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, యన్నం కోటేశ్వరరావు, తమ్మారపు బ్రహ్మం, దేవిశెట్టి రంగారావు, రావూరి శ్రీనివాసరావు, వెలగపుడి శివరాంప్రసాద్‌, చిత్తారు నాగేశ్వరరావు పాల్గొన్నారు.logo