గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 20, 2020 , 02:16:24

పోలియోను తరిమేద్దాం..

పోలియోను తరిమేద్దాం..
  • -పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం కృషి
  • -రెండు రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం
  • -జిల్లాలో 950 పల్స్‌ పోలియో కేంద్రాల్లో సేవలు
  • -మమత వైద్యశాలలో చిన్నారికి పోలియో
  • - చుక్కలు వేసి ప్రారంభించిన మంత్రి అజయ్‌   


మయూరి సెంటర్‌, జనవరి 19: పోలియో మూలాలను తరిమివేద్దామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సార్వత్రిక పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఖమ్మంలోని మమత వైద్యశాలలో చిన్నారికి పోలియో చుక్కలను వేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం పోలియో వ్యాధి నిర్మూళనలో భాగంగా పోలియో మూలాలను తరిమివేసేందుకు సార్వత్రిక పల్స్‌పోలియో కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టి చిన్నారులకు పోలియో మహమ్మారిని పారద్రోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో 2011 సంవత్సరం నుంచి నేటి వరకు ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, పోలియో బారీన పడకుండా ఉండేందుకే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యతెలంగాణ దిశగా కృషి చేస్తున్నారని, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం ఈనెల 19వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని 0-5సంవత్సరాల వయస్సు గల పిల్లలు 1,27,882 మందికి పోలియో చుక్కలు వేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.

పల్స్‌పోలియో కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, వ్యాక్సిన్‌లను అన్ని ప్రాథమిక  ఆరోగ్యకేంద్రాలలో సిద్ధంగా ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో 14 లక్షల 80వేల మంది జనభా ఉన్నారని, అందులో అప్పుడే జన్మించిన బిడ్డ నుంచి మొదలుకుని ఐదు సంవత్సరాలలోపు పిల్లలు 1లక్షా 27 వేల 882 మంది ఉన్నారని, ఈ మూడు రోజుల్లో ప్రభుత్వం నిర్థేశించిన చిన్నారులందరికీ జనసాంద్రత కలిగిన బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ప్రభుత్వ పాఠశాలల వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని, మిగిలిన వారికి డోర్‌టూడోర్‌ క్యాంపెయినింగ్‌ ద్వారా వేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి మంత్రి అజయ్‌కుమార్‌ సూచించారు. జిల్లాలో 30 సంచార బృందాలు, 40 ట్రాన్సిస్ట్‌ కేంద్రాలను బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్‌లలో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 925 బూతులు,40 ట్రాన్సిస్ట్‌ బూత్‌లు, 38 ప్లానింగ్‌ యూనిట్స్‌, 4026 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మమత వైద్యశాల మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బాగం కిషన్‌, మమత వైద్యశాల నర్సింగ్‌ విద్యార్థినులు పాల్గొన్నారు.

పోలియో రహిత సమాజం కోసం కృషి : డీఎంహెచ్‌వో

పోలియో రహిత సమాజం కోసం తమ శాఖ అవిరాళ కృషి చేస్తుందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాలతి అన్నారు. ఆదివారం  ఖమ్మంలోని మోమినాన్‌ ప్రభుత్వ పాఠశాలలో పల్స్‌పోలియో కార్యక్రమంలో బాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు కార్యక్రమం  జరగనుందని, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటి మీటింగ్‌ను నిర్వహించి వివిధ శాఖల సహకారంతో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మండల పరిధిలో గల వైద్యాధికారులు మండల పరిధి టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, మీటింగులు పెట్టి ఆయా శాఖలు ముఖ్యంగా ఐసీడీఎస్‌, విద్యా, విద్యుత్‌ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ ప్రాంతాలోని కార్మికులు, వలస ప్రజలు, గ్రానైట్‌ పరిశ్రమ కార్మికులు, మిర్చిరైతు కార్మికులు, ఇటుక బట్టీల కార్మికుల పిల్లలను, బస్‌స్టాండ్స్‌, జాతర ప్రదేశాలు, గుడి ప్రాంతాలను సందర్శించే ప్రజల పిల్లలను గుర్తించి పోలియో చుక్కలను తమ సిబ్బంది వేస్తున్నట్లు తెలిపారు.

950 పల్స్‌పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి, 3800 మంది సిబ్బందితో చిన్నారులకు వేయటానికి ఏర్పాట్లు చేశామన్నారు.  95 మంది సూపర్‌వైజర్లను నియమించామని, 4664 టీం మెంబర్స్‌,  30 సంచార బృందాల ద్వారా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి 95 వాహనాలను ఉపయోగిస్తున్నామని, 0-5 సంవత్సరాల పిల్లలకు ఏదైనా చిన్నచిన్న రుగ్మతలతో బాధపడుతున్నప్పటికి పోలియోచుక్కలు విధిగా వేయించాలని చిన్నారుల తల్లిదండ్రులకు ఆమె సూచించారు. సూచించారు. తొలి రోజు సుమారు 94.6 శాతం చిన్నారులకు పోలియో చుక్కలను వేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీవో డాక్టర్‌ అలివేలు, ఎన్‌సీడీ ఫోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ కోటిరత్నం, ఐసీడీఎస్‌ సీడీపీవో, ఫార్మసీ సూపర్‌వైజర్‌ నాగమణి, డిప్యూటీ డెమో సాంబశివరెడ్డి, సీహెచ్‌వీ రమణ, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, స్థానిక కార్పొరేటర్‌ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. logo
>>>>>>