గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 15, 2020 , 02:02:15

జయహో.. టీఆర్‌ఎస్‌

జయహో.. టీఆర్‌ఎస్‌


మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతోంది..  ఏకగ్రీవాల్లోనూ హవా కొనసాగించింది. జిల్లాలోని ఏడు వార్డులు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకుంది.. నామి నేషన్ల ఉపసంహరణ అనంతరం మంగళవారం సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను 6 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 17 వార్డులకు ఎన్నికలు జరుగ నున్నాయి. వీటిలో 49 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వైరా మున్సిపాలి టీలో 20 వార్డులకుగాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా మిగిలిన 19 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.. 73 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మధిర మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 67 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  
                      -ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ఖమ్మం జిల్లాలో ఏడు వార్డులు ఏకగ్రీవం సత్తుపల్లిలో 6, వైరాలో 1.. ముగిసిన నామినేషన్ల పర్వం  58 వార్డులకు రంగంలో 189 మంది అభ్యర్థులు తుది జాబితా విడుదల నేటి నుంచి ప్రచారం ముమ్మరం

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరగనున్న మూడు మున్సిపాలిటీలలో టీఆర్‌ఎస్‌ తన ప్రభంజనాన్ని చాటనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేటప్పటికే టీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లాలో 7 వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. దీంతో మూడు మున్సిపాలిటీలలోను టీఆర్‌ఎస్‌ విజయం నల్లేరుపై నడకలా మారింది. సత్తుపల్లి మున్సిపాలిటీలలో 23 వార్డులకు గాను 6 వార్డులను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన 17 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 49 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి రంగంలో నిలిచారు. వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకుగాను ఒక వార్డును టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 19 వార్డులకు ఎన్నికలు జరగనుండగా ఇక్కడ 73 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. మధిర మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 67 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. మూడు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్న 58 వార్డులకు 189 మంది అభ్యర్థులు రంగంలో నిలవడం జరిగింది. జిల్లాలో మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలకు ఈ నెల 22వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 14వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. మంగళవారం సాయంత్రం నాటికి వైరాలో 40 మంది, మధిరలో 48 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మూడు మున్సిపాలిటీలలోనూ టీఆర్‌ఎస్‌ ఎదురులేని శక్తిగా నిలిచే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రధాన బాధ్యతగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరాలో లావుడ్యా రాములునాయక్‌, మధిరలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు  మున్సిపాలిటీల బాధ్యతలను తమ భుజస్కాందలపై వేసుకున్నారు.

మధిరలో రంగంలో ఉన్న అభ్యర్థులు..

మధిర మున్సిపాలిటీలో ఉపసంహరణల అనంతరం 67 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరిలో టీఆర్‌ఎస్‌ నుంచి 22 మంది, కాంగ్రెస్‌ నుంచి 10 మంది, టీడీపీ నుంచి ఏడుగురు, సీపీఎం నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి 13 మంది, స్వతంత్రులుగా 10 మందిలో బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం, సీపీఐలు కూటమిగా ఏర్పడగా, టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒంటరిగా పోటీలో నిలిచాయి.

వైరా బరిలో 73 మంది అభ్యర్థులు

వైరా మున్సిపాలిటీ ఎన్నికల బరిలో 73 మంది అభ్యర్థ్ధులు రంగంలో ఉన్నారు. మొత్తం 20 వార్డులకు గాను 3వ వార్డును టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఏదునూరి పద్మజ ఏకగ్రీవం  మిగిలిన 19 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో 73 మంది రంగంలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి 19 మంది, కాంగ్రేస్‌ నుంచి 10 మంది, టీడీపీ నుంచి 6, సీపీఎం నుంచి 8, బీజేపీ నుంచి 8, సీపీఐ నుంచి ఒక్కరు, స్వతంత్రులు 21 మంది బరిలో ఉన్నారు.

సత్తుపల్లిలో  49 మంది అభ్యర్థులు

సత్తుపల్లి  ఎన్నికలలో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 23 వార్డులకుగాను ఆరు వార్డులు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 17 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికిగాను 49 మంది అభ్యర్థులు వివిధ పార్టీలకు చెందిన వారు రంగంలో ఉన్నారు.     బరిలో ఉన్న మట్టా ప్రసాద్‌, 5వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థినిగా ఉన్న నరుకుళ్ల మమత, 8వ వార్డులో బరిలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  చాంద్‌పాషా, 18వ  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి షేక్‌ గ్రాండ్‌ మౌలాలీలు ఇతర పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో వీరంతా ఏకగ్రీవమయ్యారు. 4వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థులు పోట్రు కల్యాణ్‌, విజయ్‌, టీడీపీ అభ్యర్థి చందు, 5వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి నరుకుళ్ల శివకుమారి, 8వ వార్డులో బీజేపీ నుంచి పాటిబండ్ల నాగబాబు, 18వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి షేక్‌ ఫయాజ్‌, స్వతంత్ర అభ్యర్థి గిరి  ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం 23 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే ఆరు వార్డులు ఏకగ్రీవం కావడంతో 49 మంది అభ్యర్థులు ఎన్నికల              స్వతంత్ర     9వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎవరికీ బీఫాం ఇవ్వకపోవడంతో బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల్లో ఎవరికో ఒకరికి మద్దతు తెలిపే అవకాశం ఉంది.

వైరా 3వ వార్డు సభ్యురాలికి ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందజేత

వైరా, నమస్తే తెలంగాణ: నూతనంగా ఏర్పడిన వైరా మున్సిపాలిటీలో 3వ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏదునూరి పద్మజకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కొత్తపల్లి వెంకటేశ్వర్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. వైరాలోని రైతు శిక్షణ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్‌ ఉపసంహరణ ఘట్టం ముగిసింది. సోమవారమే 3వ వార్డులో టీడీపీ అభ్యర్థి బొర్రా రాణితోపాటు టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి తమ నామినేషన్‌లు ఉపసంహరించుకున్నారు. మంగళవారం నామినేషన్‌ల ఉపసంహరణల అనంతరం 3వ వార్డులో ఒక్కరే బరిలో ఉండటంతో ఏదునూరి పద్మజ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కొత్తపల్లి వెంకటేశ్వర్లు ఎన్నికల ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ కమిషనర్‌ విజయానంద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఏదునూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సత్తుపల్లిలో మొత్తం ఆరు వార్డులు గులాబీ పార్టీ ఖాతాలోకి..

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: సత్తుపల్లి మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఉపసంహరణలో భాగంగా 4వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న మట్టా ప్రసాద్‌, 5వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థినిగా ఉన్న నరుకుళ్ల మమత, 8వ వార్డులో బరిలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి షేక్‌ చాంద్‌పాషా, 18వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి షేక్‌ గ్రాండ్‌ మౌలాలిలు ఏకగ్రీవమయ్యారు. ఇతర పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో వీరంతా యునానమస్‌ అయ్యాయి. 4వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థులు పోట్రు కల్యాణ్‌, విజయ్‌, టీడీపీ అభ్యర్థి చందు, 5వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి నరుకుళ్ల శివకుమారి, 8వ వార్డులో బీజేపీ నుంచి పాటిబండ్ల నాగబాబు, 18వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి షేక్‌ ఫయాజ్‌, స్వతంత్ర అభ్యర్థి గిరిలు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం 23 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే ఆరు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 49 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో టీఆర్‌ఎస్‌ 16, బీజేపీ 12, కాంగ్రెస్‌ 8, టీడీపీ 3, సీపీఎం 2, స్వతంత్ర అభ్యర్థులు 8 మంది ఉన్నారు. 9వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎవరికీ బీఫాం ఇవ్వకపోవడంతో బరిలో ఉన్న ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల్లో ఎవరికో ఒకరికి మద్ధతు తెలిపే అవకాశం ఉంది. మొదటిరోజు ఆదివారం ఉపసంహరణలో భాగంగా వేములపల్లి పుష్పావతి 17వ వార్డు నుంచి ఏకగ్రీవం కాగా, రెండో రోజు సోమవారం తోట సుజలారాణి 6వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థినిగా ఏకగ్రీవమైన విషయం విదితమే.
logo