బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Jan 15, 2020 , 01:57:52

మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా చేపట్టాలి

మున్సిపల్‌ ఎన్నికలను పకడ్బందీగా చేపట్టాలి
  • ఎన్నికల పరిశీలకుడు, ఏటీడీఏ పీవో గౌతమ్‌

మధిర, నమస్తే తెలంగాణ: మధిర మున్సిపాలిటీలో 22 వార్డులకు సంబంధించి 44 పోలింగ్‌ స్టేషన్‌లలో జరగనున్న ఎన్నికలను పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకులు, భద్రాచలం ఏటీడీఏ పీవో గౌతమ్‌ పేర్కొన్నారు. మంగళవారం మధిరలో బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్‌రూంలను, కౌటింగ్‌ సెంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీవో మాట్లాడుతూ.. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ఏజెంట్లను మాత్రమే అనుమతించాలని, కౌటింగ్‌ సమయంలో ప్రతి దృశ్యం వీడియో రికార్డు చేయాలని ఆదేశించారు. బ్యాలెంట్‌ బాక్స్‌లు స్ట్రాంగ్‌రూం నుంచి తీసుకొచ్చే సమయంలో పోలింగ్‌ డ్యూటీ నిర్వహించే సిబ్బంది మాత్రమే ఉండాలని, చుట్టూ భారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్‌ సమస్య లేకుండా జనరేటర్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముందుగా పోస్టల్‌బ్యాలెట్‌ లెక్కించాలని, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్స్‌లు తెరవాలన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు. ప్రతి టేబుల్‌కి ఆర్వో, ఏఆర్వో కౌంటింగ్‌ సూపర్‌వైజరర్లుగా, కౌటింగ్‌స్టాఫ్‌ టేబుల్‌కి ఇద్దరు చొప్పున నియమిస్తున్నామని తెలిపారు. అందరికీ గుర్తింపు కార్డులు జారీచేసి ఏజెంట్లకు, కౌంటింగ్‌ సిబ్బందికి వేర్వేరుగా సౌకర్యాలు ఏర్పాటు చేశామని, మున్సిపల్‌ కషనర్‌ అబ్జర్వర్‌లకు వివరించారు. అనంతరం అభ్యర్థుల విత్‌డ్రా కేంద్రాన్ని పరిశీలించారు.మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, తహసీల్దార్‌ డీ సైదులు, ఎస్సై ఉదయ్‌కుమార్‌  సిబ్బంది పాల్గొన్నారు.
logo