సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Jan 14, 2020 , 03:57:19

ఉమ్మడి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

ఉమ్మడి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

వైరా, నమస్తే తెలంగాణ, జనవరి 13: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీదే ఏకపక్ష విజయమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు స్పష్టం చేశారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైరా మున్సిపాలిటీలో 3వ వార్డు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ఏదునూరి పద్మజ ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో ఎమ్మెల్యే రాములునాయక్‌కు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమన్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున టిక్కెట్టు ఆశించి బీఫాం దక్కకుండా నామినేషన్‌ వేసిన అభ్యర్థులు తమ నామినేషన్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి నామినేషన్‌లను ఉపసంహరించుకున్న వారికి భవిష్యత్తులో పార్టీ పదవుల్లో, నామినేట్‌ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.  


జిల్లాలో మొదటి సంబురాలు వైరాలోనే..

జిల్లాలోని వైరా మున్సిపాలిటీలో 3వ వార్డు ఏకగ్రీవం చేసి మొదటి సంబురాలు చేసుకుంది వైరా మున్నిపాలిటీలోనేనని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సోమవారం రాత్రి తాతా మధు వచ్చారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన 19 వార్డుల్లో విజయకేతనం ఎగురవేయాలని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నాయకులు పసుపులేటి మోహన్‌రావు, కట్టా కృష్ణార్జున్‌రావు, ముళ్ళపాటి సీతారాములు, పోట్ల శ్రీనివాసరావు, శీలం వెంకట్రామిరెడ్డి, దార్న రాజశేఖర్‌, పోలా శ్రీను తదితరులు పాల్గొన్నారు.


logo