శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Jan 14, 2020 , 03:56:40

ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్‌

ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్‌

రఘునాథపాలెం, జనవరి13:తెలంగాణ ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్‌ నిలుస్తున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డ తల్లిదండ్రులకు భారం కాకూడదని కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి ఆర్థికంగా ఆదుకుంటున్నారని అన్నారు. ఖమ్మం నగరం వీడియోస్‌ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం రఘునాథపాలెం మండలంలోని 48మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద మంజూరైన రూ.48.05లక్షల చెక్కులను స్వయంగా అందజేశారు. అంతేకాక సీఎంఆర్‌ఎఫ్‌ కింద 14మందికి మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలందరికీ చేరుతున్నాయనడానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. పేదల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిపాలన చేపడుతోందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మంజూరైన నిధులు లబ్ధిదారుల చెంతకు చేరాలంటే చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేదన్నారు. అయినా అధికారుల చేతివాటానికి గురైతేనే తప్ప నిధులు పేదల చెంతకందని దుస్థితి ఉండేదన్నారు. అందుకే ఆయా పార్టీలు రాష్ట్రంలోనే అడ్రస్‌ గల్లంతైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గెలిచిన నాటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నానన్నారు. బంగారు తెలంగాణ కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసే గొప్ప నాయకుడన్నారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా నిత్యం ప్రజాశ్రేయస్సు కోసమే పని చేసే ‘విజన్‌' ఉన్న మహానేతగా మంత్రి అభివర్ణించారు. ఆయన అడుగుజాడల్లో పని చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలని మండల ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 


ఆడపడుచులకు ‘సంక్రాంతి’ కానుకగా..

కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాల కింద మంజూరైన చెక్కులను రఘునాథపాలెం మండలంలోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ కానుకగా అందిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కొత్త అళ్లుళ్లను పండక్కి ఇంటికి పిలుచుకొని సంక్రాతిని సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, డిప్యుటీ మేయర్‌ బత్తుల మురళి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, మాజీ చైర్మన్‌ ఆర్జేసీ కృష్ణ, వైస చైర్మన్‌ మందడపు నర్సింహారావు, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు మందడపు సుధాకర్‌, ఎంపీపీ గౌరి, వైస్‌ ఎంపీపీ గుత్తా రవికుమార్‌, తహసీల్దార్‌ నర్సింహారావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ దొంతు సత్యనారాయణ, ఖమ్మం నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు హెచ్చు ప్రసాద్‌, వీవీపాలెం ఎంపీటీసీ యరగర్ల హనుమంతరావు, మండల టీఆర్‌ఎస్‌ నాయకులు మాదంశెట్టి హరిప్రసాద్‌, నున్నా వెంకటేశ్వర్లు, నున్నా శ్రీనివాసరావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, చెరుకూరి ప్రదీప్‌, గొర్రె శ్రీనివాసరావు, కాళంగి వీరబాబు, కుందేసాహెబ్‌ పాల్గొన్నారు.


logo