ఆదివారం 29 మార్చి 2020
Khammam - Jan 14, 2020 , 03:56:08

23 మంది విత్‌ డ్రా

23 మంది విత్‌ డ్రా

(సత్తుపల్లి/ వైరా/ మధిర, నమస్తే తెలంగాణ) జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రెండో రోజైన సోమవారం మొత్తం 23 మంది అభ్యర్థులు తమ తమ నామినేషన్లను వెనక్కు తీసుకున్నారు. సత్తుపల్లిలో 16 మంది, వైరాలో ఐదుగురు, మధిర ఇద్దరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మూడు మున్సిపాలిటీల్లో రెండో రోజూ ఉపసంహరణలు కొనసాగాయి.


సత్తుపల్లిలో 16 మంది..

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, జనవరి 13: సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా రెండో రోజు సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా 16 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తహసీల్దార్‌, ఇన్‌చార్జ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మీనన్‌ తెలిపారు. వీరిలో 1వ వార్డు నుంచి గంటా విష్ణువర్ధన్‌రావు (టీఆర్‌ఎస్‌), 2వ వార్డు నుంచి నాయుడు వెంకటేశ్వరరావు (టీఆర్‌ఎస్‌), చల్లగుళ్ల కృష్ణయ్య (టీఆర్‌ఎస్‌), 3వ వార్డు నుంచి గొల్లమందల సుజాత (స్వతంత్య్ర), లంకా లక్ష్మి (టీఆర్‌ఎస్‌), 4వ వార్డు నుంచి గట్టె ప్రసాదరావు (కాంగ్రెస్‌), 6వ వార్డు నుంచి ఎస్‌కే మహ్మద్‌ అలీ (టీడీపీ), చిమటా రమేష్‌ (స్వతంత్య్ర), 8వ వార్డు నుంచి షేక్‌ రియాషత్‌ (టీఆర్‌ఎస్‌), కిష్టా రమేష్‌ (టీఆర్‌ఎస్‌), వినుకొండ రమేష్‌ (టీడీపీ), 15వ వార్డు నుంచి దాడి అనూష (టీఆర్‌ఎస్‌), 19వ వార్డు నుంచి కొత్తూరు లీలాజ్యోతి (టీఆర్‌ఎస్‌), 20వ వార్డు నుంచి కొప్పుల విజయలక్ష్మి (బీజేపీ), 22వ వార్డు నుంచి షేక్‌ రఫీ (టీఆర్‌ఎస్‌), 23వ వార్డు నుంచి కొత్తూరు ఉమామహేశ్వరరావు (టీఆర్‌ఎస్‌)లు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు వివరించారు. దీంతో 103 మంది అభ్యర్థులకు గాను 16 మంది తమ నామినేషన్లను వెనక్కు తీసుకోగా.. 87 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు చెప్పారు.


వైరాలో ఐదుగురు..

వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో మరో ఐదుగురు సోమవారం తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. వైరాలోని రైతు శిక్షణ కేంద్రంలో సోమవారం ఎన్నికల అధికారులు నామినేషఫన్‌ల ఉపసంహరణ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. మొత్తం 20 వార్డులకు 118 మంది అభ్యర్థులు గతంలో నామినేషన్‌లు వేశారు. ప్రస్తుతం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ సంఖ్య 115 మందికి తగ్గింది. వైరాలోని 3వ వార్డులో టీఆర్‌ఎస్‌ నుంచి నామినేషఫన్‌ వేసిన కారుకొండ లక్ష్మీహిమజ, టీడీపీ అభ్యర్థిని బొర్రా రాణి, 16వ వార్డులో టీఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్‌ ఆశించి నామినేషన్‌ వేసిన అభ్యర్థి ఏనుగంటి క్రిష్ణయ్య, 18వ వార్డులో టీఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్‌ ఆశించి నామినేషన్‌ వేసిన అన్నాబత్తుల వెంకటేశ్వర్లు, 13వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మాదినేని వెంకటరాంనారాయణలు తమ నామినేషన్‌లను వెనక్కు తీసుకున్నారు. ప్రస్తుతం పోటీలో ఉన్న 113 మంది అభ్యర్థుల్లో మంగళవారం మరికొంతమంది కూడా నామినేషన్‌లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది.


మధిరలో ఇద్దరు..

మధిర మున్సిపాలిటీలో రెండు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వారిలో 4వ వార్డుకు టీడీపీ నుంచి నామినేషన్‌ వేసిన వేల్పుల తిరుమలమ్మ, 13వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మార్త వరలక్ష్మీ తమ తమ నామినేషన్లను సోమవారం ఉపసంహరించుకున్నారు. వారి నామినేషన్ల ఉపసంహరణ పోను 4వ వార్డులో నలుగురు, 13వ వార్డులో ఇద్దరు పోటీలో ఉన్నారు.


logo