మంగళవారం 07 ఏప్రిల్ 2020
Khammam - Jan 14, 2020 , 03:51:03

ఇల.. లకారం ట్యాంక్‌బండ్‌పై..

ఇల.. లకారం ట్యాంక్‌బండ్‌పై..

ఖమ్మం కల్చరల్‌ జనవరి 13 :  పతంగులు ఆకాశన్నంటే విధంగా  ఎగిరాయి... పడవలో  జల విహారం ఆనంద డోలికలను నింపింది.  శాఖాహార, మాంసాహారాలు నోరూరించాయి.. ఆటపాటల ధూంధాంలు హోరెత్తించాయి.. వెరసి సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. విద్యుత్‌ కాంతులు, అందాల సోయగాలతో అలరారుతున్న లకారం ట్యాంక్‌బండ్‌పై మంగళవారం నిర్వహించిన సంక్రాంతి సంబురాలు కనుల పండువ చేశాయి.  నగర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబురంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొని పతంగులు ఎగురవేశారు. కాసేపు లకారం చెరువులో  పడవ విహారం చేసి సందర్శకులతో పండుగ ఆనంద అనుభూతులను పంచుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలు అధికారికంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుందన్నారు. గతంలో మరే ప్రభుత్వాలు చేయని విధంగా అన్ని మతాల పండుగలను అట్టహాసంగా నిర్వహిస్తూ సర్వమత సామరస్యాన్ని ఆచరిస్తున్న ప్రభుత్వమన్నారు. 


సంక్రాంతి పండుగ జిల్లా ప్రజలందరిలో సుఖ సంతోషాలు నింపాలని, జిల్లా నిత్యం పాడిపంటలు, ఐష్టెశ్వర్యాలతో విరాజిల్లాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన పలు ఆహార స్టాల్స్‌ నోరూరించాయి. మంచూరియా, పలక్‌రోల్‌, చికెన్‌, ఫిష్‌, పెసరట్టు, రొయ్యల ఫ్రై సందర్శకులను నోరూరించి ఆస్వాదింపజేశాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ పాపాలాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, కార్పోరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, చావా నారాయణరావు, కొత్తపల్లి నీరజ, ప్రశాంతలక్ష్మి  ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణ, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారధుల బృందం నిర్వహించిన ఆటపాట ధూంధాంలు హుషారెత్తించాయి. పలు డ్యాన్స్‌ సంస్థలు నృత్య ప్రదర్శనలతో అలరించాయి. వ్యాఖ్యాతలుగా మిమిక్రీ సుధాకర్‌, స్వప్నలు సందర్భోచితంగా వ్యాఖ్యానించి ఆకట్టుకున్నారు. 


logo