సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Jan 13, 2020 , 01:47:40

బాలలకు అండగా 1098

బాలలకు అండగా 1098
  • - టోల్‌ ్రఫ్రీ నెంబర్‌కు విశేష స్పందన
  • - సత్వరం స్పందిస్తున్న చైల్డ్‌లైన్‌ సిబ్బంది
  • - తప్పిపోయిన చిన్నారులను చేరదీస్తున్న సంస్థ
  • - ఆరేండ్లుగా కొనసాగుతున్న సేవలు
  • - బాలల స్నేహ పూరిత జిల్లాగా అడుగులు

ఖమ్మం వ్యవసాయం: కేంద్ర, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్‌ 1098కి జిల్లా వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది.. వివిధ శాఖల అధికారుల సహాయంతో సిబ్బంది బాలలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇతర రాష్టాలు, జిల్లాల నుంచి తప్పిపోయి వచ్చిన పిల్లలను చేరదీసి జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరు పరిచి వారి ఆదేశాలతో తిరిగి తల్లితండ్రుల చెంతకు చేరవేస్తున్నారు. అంతేకాకుండా వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న పిల్లలను పనిలో నుంచి విముక్తులను చేసి బడులలో చేర్పిస్తున్నాయి.. అలాగే బాల్యవివాహాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ నియంత్రణకు కృషి చేస్తున్నారు.. గడిచిన ఆరేళ్లలో జిల్లాలో చైల్డ్‌లైన్‌ అందిస్తున్న సేవలతో వేలాది మంది చిన్నారులకు బంగారు భవిష్యత్‌ అందించారు. మరికొద్ది రోజుల్లోనే జిల్లాను బాలకార్మిక, బాల్యవివాహాల రహిత జిల్లాగా తీర్చి దిద్దడమే తమ ప్రధాన ఆశయమని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.         

1098 టోల్‌ ఫ్రీ నంబర్‌ బాలలకు అం డగా నిలుస్తుంది. తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రుల చెం తకు చేర్చుతుంది. ఫోన్‌ చేసిన వెంటనే స్పందింస్తుంటంతో టోల్‌ ఫ్రీ నంబర్‌కు విశేష స్పందన వస్తుంది. కేంద్ర, రాష్ట్ర  స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్‌ 1098కి జిల్లా వ్యాప్తంగా ఆదరణ వస్తుంది. జిల్లాలో స్కోప్‌ ఆర్డీ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. చైల్డ్‌లైన్‌-1098  సిబ్బంది వివిధ శాఖల అధికారుల సహాయంతో బాలలకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వివిధ రాష్టాలు, ఇతర జిల్లాల నుంచి తప్పిపోయి వచ్చిన పిల్లల ను చేరదీసి జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరు పరిచి వారి ఆదేశాలతో తిరిగి తల్లితండ్రుల చెంతకు చేరవేస్తున్నారు. అదే విధంగా నగరంలో వివిధ వ్యాపార సముదాయాలలో పని చేస్తున్న పిల్లలను పనిలో నుంచి విముక్తులను చేసి పాఠశాలల్లో చేర వేస్తున్నారు. వీటితో పాటు భిక్షాటన, బాలకార్మికులు, బాల్య వివాహాల బారిన పిల్లలను గుర్తించి వారికి, సంబంధిత పెద్దలకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. గడిచిన ఆరేండ్లుగా(2013 నుంచి)  1098 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను అందుకొని పి ల్లలకు ఇష్టమైన జీవితాన్ని అందిస్తున్నారు.  ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సంవత్సరాలుగా చైల్డ్‌లైన్‌ అందిస్తున్న సేవలతో వేలాది మంది చిన్నారులకు  బంగారు భవిష్యత్‌ అందించింది.ఇందు కోంసం జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 మంది సిబ్బంది ప్రత్యక్ష్యంగా సేవలు అందిస్తున్నారు. వీరి సేవలకు జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ తమవంతు సహకారం అందిస్తుంది. దీంతో వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది చిన్నారులకు చైల్డ్‌లైన్‌ -1098 తమ వంతు సేవలు అందించడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే జిల్లాను బాలకార్మిక, బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చి దిద్దడమే తమ ప్రధాన ఆశయమని సంబంధిత అధికారులు పేర్కోంటున్నారు.

24 గంటలపాటు 1098 సేవలు

ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన 1098 సేవలు 24 గంటలు సేవలు కొనసాగిస్తుంది. అనా రోగ్యంతో బాధపడుతున్న పిల్లలు, వివక్షతకు గురైన, నిరాశ్ర యులైన, పిల్లల వివరాలు 1098 టోల్‌ ఫ్రీకి అందిస్తే సత్వరం సిబ్బంది చేరుకోవడం జరుగుతుంది. ఇంటినుంచి పారిపోయిన, తప్పిపోయిన, శారీరక, లైంగిక దాడికి గురైన, బాల్యవివాహాలు, బాలకార్మికుల వివరాలు సైతం అందించవ చ్చు. ప్రమాదాల బారిన పడిన, రైల్వే ప్ర యాణంలో అనారోగ్యానికి గురైన సత్వరం సమాచారం అందిస్తే తక్షణ సేవలు అందు తాయి. 0-18 సంవ త్సరాల లోపు బాల బాలికల కోసం 24 గంటల పాటు సేవలు అందుతాయి. బాలకార్మికుల, బాల్యవివా హాల, ఇతర వేధింపుల కు గురవుతున్న పిల్లల వివరాలను అందించిన వారి సమాచారం ఎట్టి పరిస్థితులలో బయటకు వచ్చే అవకాశం ఉండదు. 1098 ప్రధాన కేంద్రం చైన్నై లో ఉంటుంది. ఏదేని సమాచారం చేరవేసిన అనంతరం సంబంధిత జిల్లా అధికారులకు (చైల్డ్‌లైన్‌-1098)కు చేరవేస్తారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు గంట వ్యవధిలోనే సంఘటన ప్రదేశానికి సిబ్బంది చేరుకోవడం జరు గుతుంది.అవసరమైన వైద్య సేవలు అందించడమే కాకుండా ఉండటానికి వసతి, విద్య సౌకర్యం సైతం కల్పించడం జరుగుతుంది.  చైల్డ్‌లైన్‌ చేస్తున్న కృషికి ఆయా శాఖల అధికారులు తమవంతు సహకారం అందిస్తున్నారు.  బాల్యవివాహాలకు సం బం ధించి కౌన్సిలింగ్‌, తదితర ప్రక్రియ కోసం జిల్లా రెవెన్యూ, పోలీస్‌, స్త్రీ శిశు సంక్షేమశాఖ సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఐసీడీఎస్‌ అధికారులు కౌన్సిలింగ్‌ ఇస్తుండగా రెవెన్యూ, పోలీస్‌శాఖ బాల్యవివాహాలకు సహకరించే వారిపై తగు చర్యలు చేపడుతుంది. వీరికి తోడుగా పిల్ల లకు అవసరమైన న్యాయ సేవల కోసం జిల్లా బాలల న్యాయ మండలి అను నిత్యం సహకారం అంది స్తుంది.

సబ్బండ వర్గాలకు ప్రత్యేక అవగాహన

1098 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్స్‌ వచ్చిన వెంటనే స్పందిం చడంతో పాటు చైల్డ్‌లైన్‌ అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించడం జరుగుతుంది. గత మూడు సంవత్సరాలుగా సమాజంలోని వివిధ మతాలకు చెందిన మత పెద్దలతో అవ గాహన కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు. పిల్లల హక్కులను కాపాడటం కోసం కృషి చేస్తున్న ఆయా వర్గాలకు చెందిన వ్యక్తుల ను సైతం బాలబంధే అవార్డులతో సత్కరించడం జరిగింది. ప్రతి నెలలో ఆయ పాఠశాలలు, కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చైల్డ్‌లైన్‌-1098 సేవల గూర్చి తెలుపుతున్నారు. దీంతో చిన్నారుల హక్కుల కోసం ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చినైట్లెంది. గ్రామీణ ప్రాంతంలో సైతం ఉపాధి హా మి కూలీలతో పాటు, అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు.

నిర్భయంగా 1098కు ఫోన్‌ చేయవచ్చు..

కే శ్రీనివాస్‌(చైల్డ్‌లైన్‌-1098 సమన్వయకర్త)
ఆపదలో చిన్నారుల రక్షణ కోసం ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. చిన్నారులతో వెట్టిచాకిరి, బాల్య వివహాలు, బాలకార్మికులు, ఇతర అనేక సందర్బాలలో సైతం 1098కు సమాచారం అం దించవచ్చు. జిల్లాలో గడిచిన ఆరేం డ్ల నుంచి చైల్డ్‌ లైన్‌ సేవలు అందిస్తుంది. ఇందు కోసం అన్ని శాఖల అధికారులు, మత పెద్దలు, స్వచ్ఛం ద సంస్థలు సంపూర్ణ సహకారం అంది స్తున్నారు. జిల్లాను బాల్యవివాహాల, బాలకార్మిక రహిత జిల్లాగా తయారు చేసేందుకు మా వంతు కృషి చేస్తున్నాం.


logo