గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 13, 2020 , 01:45:24

రెండోవిడత పల్లెప్రగతి విజయవంతం

రెండోవిడత పల్లెప్రగతి విజయవంతం


మామిళ్లగూడెం: తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినూత్న ఆలోచనతో ఆవిష్కరించిన పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతమైంది. ప్రభుత్వం మొదటి విడతలో నెల రోజుల పాటు చేపట్టిన పల్లె ప్రగతితో మిగిలిన పనులను కొనసాగించేందకు రెండో విడతలో మరో పది రోజులు పల్లె ప్రగతి కార్యక్రమాలను కొనసాగించింది. ఈ నెల 2వతేది నుంచి ప్రారంభమైన రెండో విడత పల్లె పగతి కార్యాక్రమాలకు జిల్లాలో మంచి స్పందన లభించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మార్గదర్శకత్వంలో జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పర్యవేక్షణలో జిల్లా అధికారులు నిరంతరం ప్రజలను చైతన్యం చేసి కార్యక్రమాలను విజయవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం, పారుశుధ్య పనుల నిర్వాహణ కార్యక్రమాలను చేపట్టారు. అదేవిధంగా విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకుని సమస్యలు పరిష్కారం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం  చేస్తున్నారు. గ్రామాలలో ఉండే మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ఇతర మేధావుల సలహాలతో గ్రామాలలో కమిటీలను ఏర్పాటు చేసి పరిశుభ్రమైన పల్లెల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన కృషికి మంచి ఫలితాలు ప్రజలు అందించారు.

ప్రధానంగా గ్రామాలలో పారిశుధ్య పనులు చేపట్టడంతో సంక్రాంతి ముందు పచ్చని పల్లెలో హరిత గ్రామాలు కళ్లముందు సాక్షాతకారం కావడంతో సప్తవర్ణాల ముగ్గులు వేసేందుకు పల్లెల వీధులు ఉన్నాయని ప్రజలు ఆనందాన్ని పంచుకుంటున్నారు. పది రోజుల పాటు జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు నిరంతరం గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఎంతో కృషి చేశారు. గ్రామాలో వైకుంఠధామాలకు, డంపింగ్‌ యార్డులకు భూములు,నగదు విరాళాలు అందించిన దాతలను ఆదివారం జరిగిన ముగింపు గ్రామ సభలలో ఘనంగా సన్మా నించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ రఘునాథపాలెం మండలంలోని రేగులచలక గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో జరిగిన పల్లె ప్రగతితో గ్రామాలలో 80 శాతం పనులు పూర్తి కావడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని మంత్రి ప్రకటిం చారు. జిల్లాలో అన్ని నియోజక వర్గాలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రతి రోజు పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్య వంతం చేసి ముందకు నడిపించారు. పది రోజుల కార్యక్రమాల తీరును రాష్ట్ర ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసింది.logo
>>>>>>