మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 12, 2020 , 02:24:33

కుప్పెనకుంట్లలో పల్లె ప్రగతికి ఆర్థిక సాయం..

కుప్పెనకుంట్లలో పల్లె ప్రగతికి ఆర్థిక సాయం..పెనుబల్లి : మండల పరిధిలోని కుప్పెనకుంట్ల పంచాయతీకి పల్లెప్రగతి భాగంగా తడి, పొడి చెత్తబుట్టల సేకరణ కోసం రూ.50వేల నగదును సర్పంచ్‌ ఆళ్ల అప్పారావుకు పలువురు దాతలు అందజేశారు. పసుమర్తి వెంకటేశ్వరరావు రూ.10,116లు, బండారుపల్లి నాగేశ్వరరావు రూ.5,116లు, దొడ్డా ముత్యం రూ.5వేలు, శీలం వెంకటేశ్వరరెడ్డి రూ.5వేలు, కర్నాటి వీరభద్రారెడ్డి రూ.5వేలు, నారుమళ్ల లక్ష్మీబాబు రూ.5వేలు, పోట్రు నర్సింహరావు రూ.5వేలు, బండారుపల్లి కృష్ణయ్య రూ.3,116లు, కావిటి సత్యనారాయణ రూ.3వేలు, బద్దె శ్రీనివాసరావు రూ.3వేలు, ఇడుపులపాటి ముత్తాయమ్మ రూ.2,116లను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నారుమళ్ల లక్ష్మీబాబు, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, ఎంపీవో వాల్మీకి కిషోర్‌, కార్యదర్శి కే.రాంప్రసాద్‌, ఆవిటి మారేశ్వరరావు, ఉపసర్పంచ్‌ దుర్గం కృష్ణవేణి  పాల్గొన్నారు.


logo
>>>>>>