మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 12, 2020 , 02:23:24

స్క్రూట్నీలో 5 నామినేషన్లు తిరస్కరణ

స్క్రూట్నీలో 5 నామినేషన్లు తిరస్కరణ
  • -342 మంది అభ్యర్థులకు సంబంధించి
  • -371 నామినేషన్లు సరైనవి
  • -14వ తేదీన ఉపసంహరణ

ఖమ్మం, నమస్తే తెలంగాణ: జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సంగ్రామంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో పాటు శనివారం నామినేషన్ల స్క్రూట్నీ జరిగింది. దీనిలో జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలలో ఐదు నామినేషన్లు తిరస్కర్ణకు గురయ్యాయి. వీటిలో సత్తుపల్లిలో-2, వైరాలో-2, మధిరలో-1 చొప్పున అధికారులు నామినేషన్లను తిరస్కరించారు. మధిర మున్సిపాలిటీలలో 22 వార్డులకుగాను 120 నామినేషన్లను దాఖలు చేయగా ఒకటి తిరష్కరించారు. వీటిలో శనివారం నాటికి 115 మంది అభ్యర్థులకు సంబంధించి 119 నామినేషన్లు సరైనవిగా గుర్తించారు. అదేవిధంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు గాను 116 మంది అభ్యర్థులు 122 నామినేషన్లను దాఖలు చేయగా స్క్రూట్నీ అనంతరం 109 మంది అభ్యర్థులకు సంబందించి 109 నామినేషన్లు సరైనవిగా గుర్తించారు. ఇక్కడ ఏడుగురు అభ్యర్థులకు సంబంధించి 11 నామినేషన్లను తిరస్కరించారు. వైరా మున్సిపాలిటీలో 20 వార్డులకుగాను 119 మంది అభ్యర్థులు 145 నామినేషన్లను దాఖలు చేయగా స్క్రూట్నీ అనంతరం వీరిలో 118 మంది అభ్యర్థులకు సంబంధించి 143 నామినేషన్లు సరైనవిగా గుర్తించారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో 342 మంది అభ్యర్థులకు సంబంధించి 371 నామినేషన్లను సరైనవిగా గుర్తించారు. అయితే నామినేషన్ల తిరస్కరణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆదివారం జిల్లా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అలా ఏ విధమైన అభ్యంతరాలు వచ్చినైట్లెతే ఈ నెల 13వ తేదీన వాటిని పరిష్కరిస్తారు. ఈ నెల 14వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉన్నందున ఈలోపు వివిధ రాజకీయపార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తరువాత రంగంలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.


logo
>>>>>>