మంగళవారం 07 జూలై 2020
Khammam - Jan 12, 2020 , 02:22:52

క్రీడాకారులకు చేయూతనందిస్తా..

క్రీడాకారులకు చేయూతనందిస్తా..మయూరి సెంటర్‌, జనవరి 11: ప్రభుత్వం క్రీడాభివృద్ధి కోసం కృషి చేస్తుందని, క్రీడాకారులు జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటి రాష్ర్టానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఖమ్మంలోని జూబ్లీక్లబ్‌లో నిర్వహించిన టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు మంత్రి పువ్వాడ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబడ్డీ, వాలీబాల్‌ క్రీడలతో పాటు సమానంగా టేబుల్‌ టెన్నిస్‌కు ఇంతటి ఆదరణను కల్పించిన అసోసియేషన్‌ బాధ్యులు, కోచ్‌ల సేవలు అభినందనీయమన్నారు. ఖమ్మం జిల్లా ఇప్పటి వరకు ఉద్యమకారుల, కళాకారుల గుమ్మంగా ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారధ్యంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతితో పాటు క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశారని, ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలో సర్థార్‌ పటేల్‌ స్టేడియంలో అనేక ఇండోర్‌ స్టేడియంల నిర్మాణాలు జరిగాయని, పెవిలియన్‌ గ్రౌండ్‌లో బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారులకు రూ. కోటితో ఇండోర్‌ స్టేడియం త్వరలో అందుబాటులోకి రానుందని ఆయన స్పష్టం చేశారు.

టేబుల్‌ టెన్నిస్‌ క్రీడా విభాగంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలు అసోసియేషన్‌గా ఏర్పడి క్రీడాకారులకు క్రీడాస్ఫూర్తిని నింపడం హర్షనీయమన్నారు. అనంతరం జిల్లా టేబుల్‌ టెన్సిస్‌ అధ్యక్షులు డాక్టర్‌ సునీల్‌కుమార్‌ జంగాల మాట్లాడుతూ.. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారును తయారు చేసే విధంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ పాపాలాల్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు, కార్పొరేటర్‌ కమర్తపు మురళీ, డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌, డాక్టర్‌ కరీమ్‌, అనూప్‌, శ్రీధర్‌రావు, రవిమారుతి, అబ్జల్‌, రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ సంఘ బాధ్యులు, జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ కార్యదర్శి వీఎస్‌ మూర్తి, పీడీ శ్రీనివాస్‌, జోజి, పీఈటీ నరసింహరావు, రవి, యాకయ్య, డీఏవీ పీఈటీలు శ్రీధర్‌గౌడ్‌, రవి తదితరులు పాల్గొన్నారు.


logo