శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Khammam - Jan 09, 2020 , 18:07:08

ఖమ్మం-సూర్యాపేట రహదారి నిర్మాణానికి సర్వే.

ఖమ్మం-సూర్యాపేట రహదారి నిర్మాణానికి సర్వే.

ఖమ్మం రూరల్‌, నమస్తేతెలంగాణ, జనవరి 8: ఖమ్మం-సూర్యాపేట వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేసేందుకు గాను బుధవారం రూరల్‌ మండలం తల్లంపాడులో సర్వే, రెవెన్యూ, అదానీ గ్రూప్‌ సిబ్బంది సర్వే నిర్వహించారు. గతంలో చేసిన సర్వేకు కొంత తేడా ఉండటంతో సర్వే చేస్తున్నట్లు

ఆర్‌ఐ నరేష్‌ తెలిపారు. పూర్తి మ్యాప్‌ను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సూర్యాపేట నుంచి నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు మొదలు పెట్టడంతో పెండింగ్‌ సర్వేను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు వెంకటయ్య, రవి, హరి ఉన్నారు.


logo