మంగళవారం 07 ఏప్రిల్ 2020
Khammam - Jan 09, 2020 , 18:05:22

పత్తి కోనుగోళ్లపై కలెక్టర్‌ సమీక్ష..

పత్తి కోనుగోళ్లపై కలెక్టర్‌ సమీక్ష..

ఖమ్మం నమస్తేతెలంగాణ: జిల్లాలో కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లపై కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సీసీఐ ఛీప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీ అల్లీరాణి సమక్షంలో సమీక్ష నిర్వహించారు. బుధవారం కలెక్టర్‌లోని తన ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్షలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షలు నల్లమల్ల వెంకటేశ్వరరావు,

ఖమ్మం, మధిర మార్కెట్‌ కమిటీ చైర్మన్లు మద్దినేని వెంకటరమణ, చావా రామకృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి బాధ్యులు మాట్లాడుతూ.. జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు. గత ఏడాది సీజన్‌లో 2 లక్షల 86వేల

క్వింటాళ్లను సీసీఐ కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం ఇప్పటికే 11 కేంద్రాల్లో 3 లక్షల 56వేల క్వింటాళ్లను కొనుగోలు చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పత్తి పంటను వేసిన రైతులను గుర్తించి ఆన్‌లైన్‌ చేయడంలో కొన్ని వైఫల్యాల వలన కౌలు రైతులను గుర్తించడంలో జాప్యం జరిగిందని, మార్కెట్‌ సాఫ్ట్‌వేర్‌లో

సాంకేతిక కారణలతో ఆగిపోవడం వలన రైతలకు నష్టం జరిగిందన్నారు. ఫిబ్రవరి చివరివరకు కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంచాలన్నారు. సీఎండీ స్పందించి రైతుల దగ్గర నుంచి పత్తి రావడం ఆగి పోయేంతవరకు కొనుగోళ్లు చేస్తామన్నారు. ఈ సమీక్షలో మార్కెట్‌ కార్యదర్శి సంతోస్‌, సీసీఐ మేనేజర్‌ రమేష్‌ పాల్గొన్నారు.


logo