శనివారం 28 మార్చి 2020
Khammam - Jan 09, 2020 , 18:04:57

పురపోరులో నామినేషన్లు షురూ

పురపోరులో నామినేషన్లు షురూ

-తొలిరోజు మూడు
మున్సిపాలిటీల్లో 7దాఖలు..
-మధిర-1, వైరా-4, త్తుపల్లి-2
-నామినేషన్‌ కేంద్రాల వద్ద కోలాహలం..


వైరా, నమస్తే తెలంగాణ : నూతనంగా ఏర్పడిన వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రోజు బుధవారం 4 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల అధికారులు వైరాలోని మండల పశువైద్యశాల సమీపంలో ఉన్న రైతు శిక్షణ కేంద్రంలో నామినేషన్‌ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే తొలిరోజు మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఓసీ జనరల్‌కు రిజర్వు అయిన 9వ వార్డు నుంచి బీజేపీ తరఫున సంపసాల రమ తన నామినేషన్‌ను ఎన్నికల అధికారి పీ నవీన్‌కుమార్‌కు అందజేశారు. అదేవిధంగా ఓసీ జనరల్‌కు రిజర్వు అయిన 12వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మిట్టపల్లి నాగేశ్వరరావు (నాగి), బీజేపీ అభ్యర్థిగా సంపసాల వరదరాజు తమ నామినేషన్‌లను ఎన్నికల అధికారి వీశ్రీనివాసరావుకు అందజేశారు. ఓసీ జనరల్‌కు రిజర్వు అయిన 16వ వార్డు నుంచి ఏనుగంటి క్రిష్ణయ్య తన నామినేషన్‌ను ఎన్నికల అధికారి శ్రీరామోజి పవన్‌కుమార్‌కు అందజేశారు.

మధిరలో ఒక నామినేషన్‌..
మధిర, నమస్తేతెలంగాణ : ఈ నెల 22న నిర్వహించనున్న మధిర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా మొట్టమొదటగా 14వ వార్డుకు బీజేపీ అభ్యర్థి కోనా నరసింహరావు నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక టీవీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నామినేషన్లు స్వీకరించేందుకు వార్డుల వారీగా గదులను ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ మొదటిరోజు బుధవారం ఒకేఒక నామినేషన్‌ దాఖలైంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, పెరుమాళ్లపల్లి విజయరాజు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో తొలిరోజు రెండు నామినేషన్లు
సత్తుపల్లి, నమస్తే తెలంగాణ : ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో బుధవారం సత్తుపల్లిలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలైనట్లు తహసీల్దార్‌, ఇన్‌చార్జి కమిషనర్‌ మీనన్‌ తెలిపారు. 22వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కాజా శ్రీనివాసరావు, 2వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థినిగా పోట్రు చంద్రకళ తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్‌ ప్రక్రియ సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏసీపీ వెంకటేష్‌ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


logo