e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home ఖమ్మం దళితవాడల్లో వసతులకు రూ.30 కోట్లు

దళితవాడల్లో వసతులకు రూ.30 కోట్లు

ఎస్సీల జీవన స్థితిగతులు మారాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష
ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు
పాతర్లపాడులో టీఆర్‌ఎస్‌లోకి 100 కుటుంబాలు

చింతకాని, సెప్టెంబర్‌ 16: చింతకాని మండలంలోని దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్‌ రూ.30 కోట్లు కేటాయించారని ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. మండలంలో నాగులవంచ గ్రామ ఫంక్షన్‌ హాల్లో పాతర్లపాడు సర్పంచ్‌ కాండ్ర పిచ్చయ్య, నాగులవంచ సొసైటీ చైర్మన్‌ నల్లమోతు శేషగిరి ఆధ్వర్యంలో పాతర్లపాడు గ్రామానికి చెందిన 100 కుటుంబాలు కాంగ్రెస్‌, ఇతర పార్టీల నుంచి జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు సమక్షంలో గురువారం టీఆర్‌ఎస్‌లో చేరాయి. వారందరికీ కమల్‌రాజు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దళితుబంధు కోసం బడ్జెట్‌లో ఏటా రూ.20 వేల కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితబంధు లాంటి పథకాలే లేవని స్పష్టం చేశారు. మండలంలో అసైన్డ్‌ భూముల సమస్యపై గత సోమవారం జరిగిన దళితబంధు సమావేశంలో మంత్రి అజయ్‌ సారథ్యంలో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. త్వరలో చీఫ్‌ సెక్రటరీని మండలానికి పంపి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్లు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని, సీఎం కేసీఆర్‌ మాత్రం దళితుల జీవన స్థితిగతులు మారాలని ఆకాంక్షతో దళితబంధు ప్రవేశపెట్టారని అన్నారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, వైస్‌ ఎంపీపీ గురజాల హనుమంతరావు, రైతుబంధు సమితి సభ్యులు మంకెన రమేశ్‌, కిలారు మనోహర్‌, సొసైటీ చైర్మన్‌ కొండపల్లి శేఖర్‌రెడ్డి, సర్పంచులు చాట్ల సురేశ్‌, తిరుపతి కొండలరావు, పరిటాల యలమంద, నాయకులు వి. వెంకటలచ్చయ్య, జి.శ్రీను, పి.వీరబాబు, లక్ష్మణ్‌, బి.రామారావు, జి.వెంకటేశ్వర్లు, ఎస్‌.సైదులు, ఎన్‌నాగయ్య పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement