e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home ఖమ్మం తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

  • గ్రామీణ రహదారులకు రూ.100 కోట్లు
  • సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌
  • ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు
  • ఏన్కూరు, కొణిజర్ల మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఏన్కూరు/ కొణిజర్ల, అక్టోబర్‌ 13: తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇక్కడి పథకాల గురించి పార్లమెంటులో తల ఎత్తుకొని వివరిస్తున్నామని, మొదటిస్థానంలో ఉన్న తెలంగాణ అభివృద్ధిని మిగిలిన రాష్ర్టాలన్నీ చూస్తున్నాయని, సీఎం కేసీఆర్‌ అభివృద్ధి పాలనకు ఇదే నిదర్శనమని అన్నారు. పీఎంజీఎస్‌వై నిధులు రూ.3.26 కోట్లతో చేపట్టిన ఏన్కూరు – నాచారం బీటీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఏన్కూరులో ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతువేదికలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో నామా మాట్లాడారు. ఏటా 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తున్న తెలంగాణ.. దేశానికి ధాన్యాగారంగా మారిందని గుర్తుచేశారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ పొడుభూముల సమస్యను సీఎం కేసీఆర్‌ త్వరలోనే పరిష్కారిస్తారని అన్నారు. జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజుచ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మార్క్‌ఫైడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ బుజ్జి, ఎంపీపీ ఆరెం వరలక్ష్మి, సర్పంచ్‌ రుక్మిణి, టీఆర్‌ఎస్‌ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు గుత్తా వెంకటేశ్వరరావు, సురేశ్‌నాయక్‌, లాల్‌నాయక్‌, ధర్మారావు, రాంబాబు, గంగారత్నం, విజయకుమారి, ప్రసాద్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

తనికెళ్ల – గణేశ్వరం బీటీ రోడ్డుకు శంకుస్థాపన
కొణిజర్ల మండలంలోని తనికెళ్ల నుంచి బోడియాతండా మీదుగా రఘునాథపాలెం మండలం గణేశ్వరం వరకు రూ.3.33 కోట్ల పీఎంజీఎస్‌వై నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ నామా నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గంలో కేవలం 65 కిలోమీటర్ల రోడ్డు పనులు మాత్రమే మంజూరు చేయగా తాను కొట్లాడి 115 కిలోమీటర్లకు పెంచానన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు వెచ్చిస్తోందన్నారు.

- Advertisement -

తనికెళ్ల గ్రామంలో డివైడర్లు ఏర్పాటు చేసి డబుల్‌ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌ మోహన్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు, మహిళలు బతుకమ్మలను ఎత్తుకొచ్చి పూలవర్షంతో నామాకు స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేతోపాటు ఇతర నాయకులు కూడా బతుకమ్మలను ఎత్తుకున్నారు. ఈ కార్యక్రమాలకు వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ అధ్యక్షత వహించారు. ఎంపీపీ గోసు మధు, జడ్పీటీసీ పోట్ల కవిత, సర్పంచ్‌లు చల్లా మోహన్‌రావు, వీ.బాలాజీ, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు చంద్రమౌళి, రమేష్‌, వై.చిరంజీవి, పరికిపల్లి శ్రీను, కిలారు మాధవరావు, పోట్ల శ్రీనివాసరావు, బండారు కృష్ణ, ఎస్‌కే మౌలానా, వాంకుడోతు బాలాజీ, నాగేంద్రమ్మ, ప్రకాశ్‌, బ్రహ్మం, ఏలూరి శ్రీను, భిక్షం, రామారావు, సీతారాములు, నరసింహా, రంగా, మాన్‌సింగ్‌, రచ్చా రామకోటయ్య పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement