e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home ఖమ్మం పేదల కోసమే ముఖ్యమంత్రి సహాయనిధి

పేదల కోసమే ముఖ్యమంత్రి సహాయనిధి

పేదల కోసమే ముఖ్యమంత్రి సహాయనిధి

చెక్కుల పంపిణీలో సత్తుపల్లి
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి/ వేంసూరు, జూన్‌ 13 : అత్యవసర సమయాల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడమే ముఖ్యమంత్రి సహాయనిధి లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. నియోజకవర్గంలోని 244 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.1.17 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం ఆయన పంపిణీ చేశారు. సత్తుపల్లి మండలానికి చెందిన 43 మందికి రూ.22 లక్షల విలువైన చెక్కులను స్థానిక క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యానికి గురై అత్యవసర సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొంది ఆర్థిక ఇ బ్బందులతో సతమతమవుతున్న కుటుంబాల ను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నా రు. మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్‌, షేక్‌ చాంద్‌పాషా, అనీల్‌, నాయకులు ఒగ్గు శ్రీనివాసరెడ్డి, జగ్గారెడ్డి, పురుషోత్తం, పాలకుర్తి రాజు, బొంతు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
అభాగ్యులకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌
అభాగ్యులు, నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్‌ నిలుస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. వేంసూరులో 34 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.15.43 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను వేం సూరులో ఆదివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కాలం లో ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, డీసీసీబీ డైరెక్టర్‌ గొర్ల సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు పాలా వెంకటరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు, గుత్తా శ్రీనివాస్‌, సీడీసీ డైరెక్టర్‌ శంకర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ జగన్మోహన్‌రావు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేదల కోసమే ముఖ్యమంత్రి సహాయనిధి
పేదల కోసమే ముఖ్యమంత్రి సహాయనిధి
పేదల కోసమే ముఖ్యమంత్రి సహాయనిధి

ట్రెండింగ్‌

Advertisement