e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home ఖమ్మం పల్లె వికాసం.. ప్రభుత్వ నినాదం

పల్లె వికాసం.. ప్రభుత్వ నినాదం

పల్లె వికాసం.. ప్రభుత్వ నినాదం

సీఎం కేసీఆర్‌తోనే రాష్ర్టాభివృద్ధి
రైతులను ఆదుకున్నది తెలంగాణ సర్కార్‌ మాత్రమే..
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు
మంత్రులు పువ్వాడ అజయ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు
సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి మండలాల్లో పర్యటన
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ఎమ్మెల్యే సండ్ర కృషికి మంత్రుల అభినందన

సత్తుపల్లి, జూలై 11: ‘సీఎం కేసీఆర్‌ దార్శనికతతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.. పల్లెలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నాయి.. నాటి ప్రభుత్వాలు రైతాంగాన్ని పట్టించుకోలేదు.. ప్రజల కష్టాలను తీర్చలేదు.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సర్కార్‌ రైతులకు అండగా నిలిచింది.. రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నది.. వారి సమస్యల పరిష్కారానికి రైతువేదికలు నిర్మించింది.. ప్రజల సమస్యల పరిష్కారానికి ‘పల్లె, పట్టణ ప్రగతి’ అమలు చేస్తున్నది..’ అని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలతో గ్రామాలు విరాజిల్లుతున్నాయని అన్నారు. వారి వెంట ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ బాలసాని, జడ్పీ చైర్మన్‌ లింగాల ఉన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రైతులను ఆదుకున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి ఆదివారం ఆయన మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా మండలంలోని పాకలగూడెంలో రూ.3.73 కోట్లతో పాకలగూడెం – సత్యనారాయణపురం బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గంగారంలో రైతువేదిక, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాలను ప్రారంభించారు. రూ.17.50 కోట్లతో రేజర్ల – తాళ్లమడ, రేజర్ల – ఎండపల్లి గ్రామాల మధ్య నిర్మించనున్న బ్రిడ్జిల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గంగారంలో జరిగిన గ్రామసభలో మంత్రి దయాకర్‌రావు మాట్లాడారు. రైతులను పట్టించుకున్న ముఖ్యమంత్రుల్లో ఆనాడు ఉన్నది ఎన్టీఆర్‌ అయితే నేడు మన సీఎం కేసీఆర్‌ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో ముందంజలో ఉందని, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొట్లాడి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల పనితీరును ప్రజల్లోకి తీసుకువెళుతున్నారని అన్నారు. పర్యటనలో భాగంగా రేజర్లలో అంబేద్కర్‌ విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేశారు. బీటీ రోడ్డు శంకుస్థాపన పైలాన్‌ వద్ద సీఎం ఫ్లెక్సీకి పుష్పాభిషేకం చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, కలెక్టర్‌ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ మొగిలి స్నేహలత, జడ్పీ సీఈవో ప్రియాంక, ఆర్డీవో సూర్యనారాయణ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, విద్యుత్‌ ఎస్‌ఈ రమేశ్‌, పీఆర్‌ డీఈ నళినీమోహన్‌, డీఆర్‌డీవో విద్యాచందన, మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, ఎంపీపీ దొడ్డా హైమావతీ శంకర్‌రావు, ఆత్మచైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, సర్పంచ్‌లు మందపాటి శ్రీనివాసరెడ్డి, దుగ్గిరాల వాణి, జక్కుల ప్రభాకర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, రైతుబంధు కన్వీనర్‌ గాదె సత్యం, తహశీల్దార్‌ మీనన్‌, ఎంపీడీవో సుభాషిణి, మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీను, అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆదర్శంగా పల్లె ప్రకృతి వనాలు
బత్తులపల్లి, కల్లూరు పల్లెప్రకృతివనాలు ఆదర్శంగా ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా మండలంలోని బత్తులపల్లి, కల్లూరు పల్లె ప్రకృతి వనాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. సుందరంగా తీర్చిదిద్దడం వల్ల అవి ఆదర్శవంతంగా ఉన్నాయని ప్రశంసించారు. బత్తులపల్లిలో సర్పంచ్‌ శీలం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనాన్ని, రైతువేదికను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి అదనపు కలెక్టర్‌ మొగిలి స్నేహలత ద్వారా ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా పల్లెప్రకృతివనంలో కలియతిరిగారు. మొక్కలు బాగున్నాయని, ఎక్కడ నుంచి తీసుకువచ్చారని అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పల్లెప్రకృతివనంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అక్కడ రైతువేదికలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతులు తమ సమస్యల గురించి చర్చించుకునేందుకు, అన్నదాతలు సంఘటితమయ్యే ందుకు రైతువేదికలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అనుభవం ఉన్న నాయకుడని, ప్రజాసమస్యలపై నిత్యం పోరాడుతూ సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు ఎన్నోసార్లు వచ్చారని, రూ.35 కోట్ల నిధులను నియోజకవర్గానికి మంజూరు చేయించుకున్నారని అన్నారు. అలాంటి ఎమ్మెల్యే ఉండడం సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ మండలంలోని కొన్ని అభివృద్ధి పనులకు నిధులు ఇప్పించాలని మంత్రిని కోరగా వెంటనే అడిగిన నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారన్నారు. తొలుత బత్తులపల్లి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, జడ్పీ సీఈవో ప్రియాంకకు మహిళలు పూలతో ఘనస్వాగతం పలికారు. తహసీల్దార్‌ మంగీలాల్‌, ఎంపీడీవో టీ.శ్రీనివాసరావు, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఇస్మాయిల్‌, డీసీసీబీ డైరెక్టర్‌ బోబోలు లక్ష్మణరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతుబంధు సమితి సభ్యులు పసుమర్తి చందర్‌రావు, లక్కినేని రఘు, ఎంపీటీసీ కొర్రా రుక్మిణి, కల్లూరు సర్పంచ్‌ లక్కినేని నీరజ రఘు, ఉప సర్పంచ్‌ రాచమళ్ల జానకీకుమారి పాల్గొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

సకల కష్టాల నివారణకు.. శ్రీకృష్ణశ్శరణం మమ

షాకింగ్: న‌గ్నంగా చ‌ర్చిపైకి ఎక్కి.. శిలువ‌కు నిప్పుపెట్టి.. వీడియో

రేపు భ‌క్తులు లేకుండానే జ‌గన్నాథ‌ ర‌థ‌యాత్ర‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పల్లె వికాసం.. ప్రభుత్వ నినాదం
పల్లె వికాసం.. ప్రభుత్వ నినాదం
పల్లె వికాసం.. ప్రభుత్వ నినాదం

ట్రెండింగ్‌

Advertisement