e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home ఖమ్మం నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుక

నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుక

నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుక

ఖమ్మం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి అజయ్‌కుమార్‌
తెలంగాణ తల్లికి పూలమాల, అమరవీరుల స్థూపం వద్ద నివాళి

ఖమ్మం జూన్‌ 2 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుధవారం ఖమ్మం నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్‌శాఖ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. తొలుత ఆయన నగరంలోని బైపాస్‌రోడ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. మయూరిసెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, పోలీస్‌ కమిషననర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ కురాకుల నాగభూషణం, ఖమ్మం కార్పొరేషన్‌ చైర్మన్‌ అనురాగ్‌ జయంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖమర్‌, అధనపు కలెక్టర్‌ మధుసూదన్‌, ఆర్డీవో రవీంద్రనాథ్‌, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహారా, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ ఇన్‌చార్జి ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు కర్నాటి కృష్ఱ, ముఖ్యనేతలు కమర్తపు మురళి, పసుమర్తి రామ్మోహన్‌, తోట రామారావు, కన్నం ప్రసన్న, నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి, నాయకులు చింతనిప్పు కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుక

ట్రెండింగ్‌

Advertisement