e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home ఖమ్మం ‘స్నేహ’ సమీరం

‘స్నేహ’ సమీరం

  • ఎప్పటికీ వీడిపోలేనిది మధురమైన బంధం
  • ఎన్ని జన్మలకూ తీరిపోనిది మమతల స్నేహం
  • సృష్టిలోనే గొప్పది.. కల్మషం లేని స్నేహబంధం
  • నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

‘-ఖమ్మం కల్చరల్‌/ కొత్తగూడెం కల్చరల్‌, జూలై 31: స్నేహానికి చెలికాడా దోస్తీకీ సరిజోడా.. ఏళ్లెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడ..’ అంటూ చెలిమి బంధాన్ని చాటే ఎన్ని స్నేహగీతాలు వచ్చినా.. ఆ మైత్రీబంధానికి సరితూగలేవు. సృష్టిలో తీయనిది.. ఆత్మీయమైనది.. ఆఖరి శ్వాస వరకు ఉండేది.. పుట్టుక తీరు తెలియనిది.. స్నేహబంధం. అనురాగాల కల్పతరువైనది.. అరమరికలు లేనిది.. స్వచ్ఛతకు రూపమైనది.. ఈ మమతల బంధం. అదే మధురమైన స్నేహబంధం. అందుకే.. పెద్దలూ అన్నారు.. మంచి నేస్తాన్ని మించిన ఆస్తి లేదని. నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మమతలు పంచే చెలిమి గురించి ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.

ఫ్రెండ్షిప్‌ డే నేపథ్యం..
1919లో అమెరికాలో గ్రీటింగ్‌ కార్డ్స్‌ పరిశ్రమను నిర్వహించే ‘హాల్‌ మార్క్‌ కార్డ్స్‌’ అనే వ్యక్తి మనసులో రూపుదిద్దుకున్న ఆలోచనే స్నేహితుల దినోత్సవం. మొదట బొకే బాండ్స్‌ కట్టడంతో మొదలైంది. 1958 జూలై 20న పెరుగ్వే పట్టణంలో డాక్టర్‌ ఆర్టేమియా బ్రాకో స్నేహితులతో విందు సమయంలో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించారు. యుఎన్‌ జనరల్‌ అసెంబ్లీ జూలై 30ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు 1958 జూలై 30 నుంచి స్నేహితుల దినోత్సవ సంబురాలు జరుపుకుంటున్నాయి. భారతదేశం, బంగ్లాదేశ్‌, మలేషియా వంటి దేశాలు ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్‌ డేగా జరుపుకుంటున్నాయి.

మరపురాని బాంధవ్యం..
మనిషి పొందిన గొప్పవరం.. స్నేహం. ఈ బంధం గురించి స్ఫూర్తినిచ్చే పురాణగాథలు, నేటి కథలు ఎన్నో ఉన్నాయి. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాలతోపాటు అష్టాదశ పురాణాలు, పంచతంత్ర కథల్లో కూడా స్నేహమాధుర్యం వెల్లివిరిసింది. శ్రీకృష్ణుడు కుచేలుడు, కర్ణుడు సుయోధనుల చెలిమి స్నేహబంధం విలువను, గొప్పతనాన్ని చాటుతాయి. ప్రతి ఒక్కరి జీవన ప్రస్థానంలో స్నేహ సమీరం మనసును తాకుతోనే ఉంటుంది. జీవిత ప్రయాణంలో సేద తీర్చే చెట్టునీడలు స్నేహబంధాలు. మంచి నేస్తం ఉంటే జీవితానికి చక్కని మార్గదర్శకుడు ఉన్నట్లే.

- Advertisement -

ఆన్‌లైన్‌ వేదికల్లో ‘దోస్తీ’
కాలం మారింది. స్నేహితుల దినోత్సవం స్వరూపమూ మారుతూ వస్తోంది. ఫ్రెండ్షిప్‌డే నాడు స్నేహితులు పరస్పరం కలుసుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకొని గ్రీటింగ్‌ కార్డులు అందించుకునే రోజులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడంతా ఆన్‌లైన్‌. చివరికి స్నేహభావాన్ని కూడా ఆన్‌లైన్‌లోనే పంచుకుంటున్న రోజులివి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌, చాట్‌బాక్స్‌ తదితర ఆన్‌లైన్‌ వేదికలు స్నేహ వారధులను పెంచుతున్నాయి. కానీ ప్రమాదాలూ వాటి వెన్నంటే ఉంటున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana