e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home ఖమ్మం బాధితులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

బాధితులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

బాధితులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నియోజకవర్గ వ్యాప్తంగా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సత్తుపల్లి/ కల్లూరు/ పెనుబల్లి/ తల్లాడ, మే 1: అనారోగ్యానికి గురైన బాధితులకు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చికిత్సపొందిన నిరుపేదలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. నియోజకవర్గంలోని సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ మండలాల్లో శనివారం ఆయన పర్యటించి బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఏప్రిల్‌ నెలలో ఇప్పటివరకు 135 మందికి రూ.80.78 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందించినట్లు వివరించారు. శనివారం కల్లూరు మండలంలో 37 మంది లబ్ధిదారులకు రూ.17.54 లక్షలు, సత్తుపలిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు రూ.17.92 లక్షలు, తల్లాడలో 24 మందికి రూ.16.39 లక్షలు, పెనుబల్లిలో 15 మందికి రూ.7.40 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని అన్నారు. కొంత ఆలస్యం జరిగినా రైతులు అధైర్యపడవద్దని, ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. చేశారు. కల్లూరు ఎంపీపీ బీరవల్లి రఘు, డీసీసీబీ డైరెక్టర్లు బోబోలు లక్ష్మణరావు, డీసీసీబీ డైరెక్టర్‌ చళ్లగుళ్ల కృష్ణయ్య, సత్తుపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీలు కూసంపూడి రామారావు, చెక్కిలాల మోహన్‌రావు, సీడీసీ చైర్మన్‌ ముక్కర భూపాల్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా మండలాల టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాధితులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

ట్రెండింగ్‌

Advertisement