e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home ఖమ్మం ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయం

తల్లాడ, జూలై 28: ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. పేదలను ఆదుకుంటున్న గొప్ప మానవతావాది సీఎం కేసీఆర్‌ అని అన్నారు. తల్లాడ రైతువేదికలో బుధవారం డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ జీ.శ్రీలత అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ఆహారభద్రత కార్డులు రానివారు ఆందోళన చెందవద్దని, మరో విడతలో అర్హులందరికీ కార్డులు అందుతాయని అన్నారు. ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్‌ రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ దూపాటి భద్రరాజు, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ఎస్సై నరేశ్‌, ఎంపీవో కొండపల్లి శ్రీదేవి, ఆర్‌ఐ శ్రీనివాసరావు, ఆత్మ డైరెక్టర్‌ కేతినేని చలపతిరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana