e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home ఖమ్మం పేదల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

సుజాతనగర్‌, జూలై 29: నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో మండలానికి చెందిన 176 మందికి ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందుందన్నారు. రేషన్‌కార్డు రాని వారు బాధపడొద్దన్నారు. త్వరలో ప్రభుత్వం రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్రంలో కొత్తగూడేన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేందర్‌రావు, తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఏఎంసీ చైర్మన్‌ భూక్యా రాంబాబు నాయక్‌, ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్‌ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్‌ మండె వీరహనుమంతరావు, రైతుబంధు సమితి సభ్యుడు మోహన్‌రావు, ఎంపీటీసీలు పెద్దమళ్ల శోభారాణి, బత్తుల మానస, మూడ్‌ గణేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana