e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News చిన్న బీరవల్లి చింత తీరింది

చిన్న బీరవల్లి చింత తీరింది

చిన్న బీరవల్లి చింత తీరింది

పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం

బోనకల్లు, జూన్‌ 21:ఒకప్పుడు చిన్న బీరవల్లి గ్రామస్తులు సరైన వసతులు లేక ఇబ్బంది పడేవారు.. వర్షం వస్తే వీధుల్లోనే వరద నీరు నిలిచేది.. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉండడంతో నడవడానికీ వీలు లేని పరిస్థితి ఉండేది.. ఇలాంటి పరిస్థితుల నుంచి తెలంగాణ సర్కార్‌ ప్రోత్సాహంతో ఈ పల్లె ఇప్పుడు తన రూపురేఖలు మార్చుకున్నది.. ప్రభుత్వ నిధులతో పాలకవర్గం గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించింది.. ‘పల్లె ప్రగతి’ లక్ష్యాలను చేరుకుని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది..

ఒకప్పుడు చిన్న బీరవల్లి గ్రామం కనీస సౌకర్యాలు లేక సతమతమైంది. గ్రామంలోని రైతులే కాకుండా అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడ్డారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ఈ పల్లె రూపురేఖలే మారాయి. ఇక్కడ చేపట్టిన పనులతో అన్ని వసతులు సమకూరాయి. ప్రస్తుతం ఈ గ్రామం పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో అందంగా దర్శనమిస్తున్నది.

- Advertisement -

గ్రామంలో పూర్తి చేసిన అభివృద్ధి పనులు..
సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులను ఇక్కడి పంచాయతీ పాలకవర్గం సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దింది.
3 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఉన్న గ్రావెల్‌ను గత పాలకులు తరలించడంతో పెద్ద లోయగా ఏర్పడింది. ఆ లోయను రూ.12లక్షల నిధులతో పూడ్చి చదును చేశారు.
ఈ మూడెకరాల స్థలంలోనే రూ.12.60లక్షలతో వైకుంఠధామం, రూ.2.30 లక్షలతో డంపింగ్‌యార్డు, రూ.22లక్షల వ్యయంతో రైతువేదికను నిర్మించారు. అహ్లాదకర వాతావరణం కోసం రకరకాల మొక్కలను నాటి ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశారు.
25 సెంట్ల భూమిలో నర్సరీను ఏర్పాటు చేసి 16 వేల మొక్కలను పెంచి హరితహార కార్యక్రమానికి సిద్ధం చేశారు. ఈ అభివృద్ధి పనుల సముదాయం చుట్టూ రక్షణ కల్పించేందుకు ఫెన్షింగ్‌ ఏర్పాటు చేశారు.
ఎస్‌బీఎఫ్‌ నిధుల ద్వారా మంజూరైన రూ.10 లక్షలతో మూడు సీసీరోడ్లు, మూడు కల్వర్టులు నిర్మించారు.
జిల్లా పరిషత్‌ ద్వారా మంజూరైన రూ.4 లక్షలతో రోడ్డు నిర్మాణం, అంతర్గత రోడ్లకు గ్రావెల్‌ తోలకాలు చేపట్టారు. దీంతో గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు పల్లెప్రగతి కార్యక్రమం ద్వారాద్వారా పూర్తిచేశారు.

పల్లె ప్రగతే గ్రామాన్ని మార్చింది..
పల్లెప్రగతి కార్యక్రమంతోనే మా గ్రామం పూర్తిగా మారింది. గ్రామానికి కావాల్సిన నిధులు వచ్చాయి. దీంతో గ్రామాభివృద్ధికి బాటలు వేశాం. సీఎం కేసీఆర్‌ గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించడంతోనే సాధ్యమైంది. ప్రతి రూపాయిని గ్రామాభివృద్ధికి వినియోగించాం.

  • తేరబత్తిని శాంతయ్య, సర్పంచ్‌ అన్ని పనులు పూర్తిచేశాం
    ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన పనులకు మంజూరైన నిధులను కేటాయించి సద్వినియోగం చేసుకున్నాం. గ్రామంలో ప్రతిఇంటికి మంచినీటి సరఫరాతో పాటు, ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించాం.
  • గాయం రామారావు, పంచాయతీ కార్యదర్శి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చిన్న బీరవల్లి చింత తీరింది
చిన్న బీరవల్లి చింత తీరింది
చిన్న బీరవల్లి చింత తీరింది

ట్రెండింగ్‌

Advertisement