e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home కరీంనగర్ ఓపెన్‌జిమ్‌లను అందుబాటులోకి తెస్తాం

ఓపెన్‌జిమ్‌లను అందుబాటులోకి తెస్తాం

ఓపెన్‌జిమ్‌లను అందుబాటులోకి తెస్తాం

కార్పొరేషన్‌, ఏఫ్రిల్‌ 12: నగరంలో ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కరీంనగర్‌ బల్దియా కమిషనర్‌ వల్లూరి క్రాంతి తెలిపారు. సోమవారం 35 వ డివిజన్‌తో పాలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మొదటి విడుతలో 30 జిమ్‌లను నిర్మిస్తున్నామన్నా రు. ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ పను ల్లో భాగంగా హౌసింగ్‌బోర్డును మోడ్రన్‌ కాలనీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుం టున్నామన్నారు. అంతర్గత స్మార్ట్‌రోడ్ల పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్లు, మంచినీటి పైప్‌లైన్లు వేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించాలని అధికారులకు సూ చించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మేమేం గొర్రెలం కాదు.. లాక్‌డౌన్‌ను ప్రశ్నించిన బ‌జాజ్

తగ్గేదే లే.. విరాట్ కోహ్లీ గెటప్ కు అల్లు అర్జున్ ఫిదా..

Advertisement
ఓపెన్‌జిమ్‌లను అందుబాటులోకి తెస్తాం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement