హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ పట్టణ దళితవాడలో నిర్వహించిన దసరా వేడుకల్లో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు. పట్టణానికి చెందిన దళిత సోదరుడు యాదగిరి ఆహ్వానం మేరకు బాల్క సుమన్ అతని ఇంటికి వెళ్లారు. పండుగ సందర్భంగా యాదగిరి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.