e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home కరీంనగర్ ‘కాళేశ్వరం’తో హుజూరాబాద్‌ సస్యశ్యామలం

‘కాళేశ్వరం’తో హుజూరాబాద్‌ సస్యశ్యామలం

  • సాగు నీరు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే
  • సింగిల్‌ విండో చైర్మన్‌ ఎడవెల్లి కొండల్‌రెడ్డి
‘కాళేశ్వరం’తో హుజూరాబాద్‌ సస్యశ్యామలం

హుజూరాబాద్‌, జూలై 20: కాళేశ్వరం జలాలతో హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని సింగిల్‌ విండో చైర్మన్‌ ఎడవెల్లి కొండల్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని వ్యవసాయ మారెట్‌ వద్ద డీబీఎం 16 కాలువ నుంచి సాగునీటిని మంగళవారం ఆయన టీఆర్‌ఎస్‌ నాయకులు ఎస్‌ ఐలయ్య, మొలుగూరి ప్రభాకర్‌, నిమ్మ రాజయ్య, మారెపల్లి ఆంజనేయులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కొండల్‌రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సారెస్పీ నీరు సక్రమంగా రాక, రైతులు బావులు తవ్వేవారని, బోర్లు వేసేవారని అన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, కమలాపూర్‌, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లోని ఆయకట్టుకు సరిపడా సాగు నీరు అందుతున్నట్లు తెలిపారు. మండుటెండల్లో సైతం కాకతీయ కాలువ పరవళ్లు తొకిందని, తద్వారా సాగు, తాగునీటికి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ కృషితోనే గోదావరి జలాలు హుజూరాబాద్‌కు వస్తున్నాయని తెలిపారు. 24 గంటల విద్యుత్‌, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం, కరోనా సమయంలో ధాన్యం కొనుగోలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

టీఆర్‌ఎస్‌ గెలుపు లాంఛనమే
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలుపు లాంఛనమే అని సింగిల్‌ విండో చైర్మన్‌ ఎడవెల్లి కొండల్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌ పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ఆటలు ఇక సాగవని మండిపడ్డారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుపై విమర్శలు చేసే అర్హత ఈటలకు లేదని, ఆయన పాదయాత్రలో ఎలాంటి పస లేదని అన్నారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘కాళేశ్వరం’తో హుజూరాబాద్‌ సస్యశ్యామలం
‘కాళేశ్వరం’తో హుజూరాబాద్‌ సస్యశ్యామలం
‘కాళేశ్వరం’తో హుజూరాబాద్‌ సస్యశ్యామలం

ట్రెండింగ్‌

Advertisement