e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home కరీంనగర్ టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటాం

టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటాం

  • బుడగజంగాల సంపూర్ణ మద్దతు
  • తీర్మానం చేసిన ప్రతి స్థానిక నేతలకు అందజేత
  • కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తామని ప్రతిన
టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటాం

హుజూరాబాద్‌ టౌన్‌, జూలై 10: హుజూరాబాద్‌ పట్టణంలోని బుడగజంగాల కాలనీవాసులు టీఆర్‌ఎస్‌ పార్టీకి మూకుమ్మడిగా మద్దతు ప్రకటించారు. సంక్షేమ ప్రదాత సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తామని స్పష్టం చేశారు. శనివారం 200 మంది కులస్తులు తీర్మానం చేసి ప్రతిని 23వ వార్డు కౌన్సిలర్‌ మొలుగు సృజనా పూర్ణచందర్‌, కరీంనగర్‌ కార్పొరేటర్‌ ఏదుల రాజశేఖర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ సమైక్య పాలకులు బుడగజంగాల అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇండ్లులేని నిరుపేదలకు ఖాళీ స్థలాల్లో నివసించేందుకు అవకాశం ఇవ్వడమేగాక డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించేందుకు హామీ ఇచ్చిందని చెప్పారు. అంతేకాకుండా స్వయం ఉపాధి కోసం ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకుంటున్నదని గుర్తు చేశారు. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకుడు పలుమార్లు కాలనీని సందర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. మళ్లీ ఓటు కోసం వస్తే బుద్ధి చెప్పేందుకు బుడిగజంగాల కులస్తులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ, టీడీపీ నేతలు
కౌన్సిలర్‌ మొలుగు సృజనాపూర్ణచందర్‌, కరీంనగర్‌ కార్పొరేటర్‌ ఏదుల రాజశేఖర్‌ సమక్షంలో శనివారం బేడ బుడగజంగాల కాలనీకి చెందిన బీజేపీ, టీడీపీ నాయకులు పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. బీజేపీ నేత గంధం రవి, అతడి అనుచరులు, టీడీపీ నేత తూర్పాటి సమ్మయ్య అలియాస్‌ పెద్దిరెడ్డి సమ్మయ్య, కుల సంఘం పెద్దలు పార్టీలో చేరగా, రాజశేఖర్‌ వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలు పోరెడ్డి శంతన్‌రెడ్డి, మొలుగు పూర్ణచందర్‌, టేకుల శ్రావణ్‌, కుల పెద్దలు మోతె సమ్మయ్య, మోటం రామచంద్రం, తూర్పాటి శ్రీనివాస్‌, మోటం రాంబాబు, మోటం వెంకటేశ్‌, వెంకటేశ్‌, రాజు, సమ్మక, మల్లవ్వ, కృష్ణంరాజు, తూర్పాటి ఉప్పలయ్య, తూర్పాటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

- Advertisement -

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే తగిన గుర్తింపు..
గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలే. సంచార జీవితం గడిపే మాకు స్థిర నివాసం ఉండాలని రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మా కోసం ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేసింది. ఉపాధి లేక, కూలి పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్న మమ్మల్ని ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించారు. అలాగే డబుల్‌ బెడ్రూం పథకంలో ఇళ్లు లేని వారికి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో మేమంతా సామూహికంగా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రతిజ్ఞ చేశాం.

  • మౌటం రాంకుమార్‌, బేడ బుడిగజంగాల సంఘం రాష్ట్ర నాయకుడు

డబుల్‌ బెడ్రూం పథకంలో అవకాశం ఇస్తున్నరు..
కొన్నేళ్లుగా ఉండడానికి ఇల్లు లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్న మమ్మల్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక చేరదీసింది. బుడిగజంగాల కాలనీ ఏర్పాటు చేసి గుడిసెలు వేసుకుని జీవించేందుకు అవకాశం ఇచ్చింది. అంతేగాక డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకంలో మాకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడం ఎంతో సంతోషం కలిగిస్తున్నది. రెక్కాడితే డొక్కాడని మా కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఆదుకుంటున్నది. మా పిల్లలకు పెండ్లి చేసి పంపేందుకు కల్యాణలక్ష్మి ద్వారా డబ్బులు ఇస్తూ ఇంటికి పెద్దన్నలాగా ఉన్న సీఎం కేసీఆర్‌కు మేమందరం తోడుగా ఉంటం. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎవరిని నిలబెట్టినా గెలిపించుకుంటం.

  • తూర్పాటి సమ్మయ్య, బుడిగజంగాల సంఘం నాయకుడు

ఆదుకునే సర్కారుకు అండగా ఉండండి..
సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రజల కష్టసుఖాలను పట్టించుకోని గత పార్టీలను వచ్చే ఉప ఎన్నికలో తరిమికొట్టాలి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు అండగా ఉండాలి. సంచార జాతులైన బేడ బుడిగజంగాలకు స్థిర నివాసం కోసం నివేశన స్థలాలు కేటాయించడంతో పాటు త్వరలో అర్హులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు కూడా మంజూరవుతయి. స్థానికంగానే స్వయం ఉపాధి పొందేలా సబ్సిడీ రుణాలు ఇస్తూ బేడ బుడిగజంగాలను ఆదుకుంటున్న ప్రభుత్వం ఒక్క టీఆర్‌ఎస్‌ మాత్రమే. సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరఫున ఎవరికి టికెట్‌ ఇచ్చి పోటీలో నిలబెట్టినా ఓటర్లందరూ సామూహికంగా టీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నరు.

  • మొలుగు సృజనాపూర్ణచందర్‌, 23వ వార్డు కౌన్సిలర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటాం
టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటాం
టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటాం

ట్రెండింగ్‌

Advertisement