e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home కరీంనగర్ గ్రామాల్లో గణనీయమైన మార్పు

గ్రామాల్లో గణనీయమైన మార్పు

  • ముగిసిన పల్లెప్రగతి కార్యక్రమం
  • మెరుగైన పారిశుధ్యం
  • హరితహారంలో మొక్కల పెంపకం
  • ప్రతి పల్లెలో గ్రామసభ
  • పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు
  • విశేష సేవలందించిన సిబ్బందికి సన్మానం, పురస్కారాలు
గ్రామాల్లో గణనీయమైన మార్పు

శంకరపట్నం, జూలై 10: పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో గణనీయమైన మార్పు వచ్చిందని ఎంపీపీ ఉమ్మెంతల సరోజన, మండల ప్రత్యేకాధికారి జయశంకర్‌ పేర్కొన్నారు. నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం చివరి రోజు శనివారం అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కొత్తగట్టు గ్రామసభకు హాజరయ్యారు. మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పది రోజుల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ముత్తారం గ్రామంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని తీర్మానించారు. గ్రామస్తులకు క్లాత్‌ బ్యాగులు పంపిణీ చేశారు. పచ్చదనం పంచడంలో విశేషంగా కృషి చేస్తున్న వీవోఏలు పల్లె సుజాత, బొంగోని శారదను ఎంపీడీవో జయశ్రీ, సర్పంచ్‌ పంజాల రేణుక, ఎంపీటీసీ మోతె భాగ్యలక్ష్మి శాలువాలు కప్పి సన్మానించారు. ఆముదాలపల్లి లో సర్పంచ్‌ మానస జేసీబీతో రోడ్ల పక్కన చెట్లు, ముండ్ల పొదలను తొలగించారు. ఆయా గ్రామాల్లో సర్పచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి
చిగురుమామిడి, జూలై 10: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్‌ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా చివరి రోజు శనివారం మండలంలోని చిగురుమామిడి, ములనూరు, ఉల్లంపల్లి, కొండాపూర్‌ గ్రామసభలు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో మొకలు నాటారు. శిథిలావస్థకు చేరుకున్న పురాతన ఇండ్లు కూల్చారు. హరితహారం మొకలు ఇంటింటా పంపిణీ చేశారు. ప్రారిశుధ్యంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ నతానియర్‌, ఎంపీడీవో విజయలక్ష్మి, ఏపీవో జిల్లా రాధ, సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్‌, ముప్పిడి వెంకట నరసింహారెడ్డి, పెద్దపెల్లి భవాని, చెప్యాల మమత పంచాయతీ కార్యదర్శులు హమీద్‌ఖాన్‌, రాంకీ, మదనయ్య ఉన్నారు.

- Advertisement -

హరితనిలయాలుగా మారడమే లక్ష్యం
గన్నేరువరం, జూలై10 : తెలంగాణలోని ప్రతి గ్రామం హరిత నిలయంగా మారడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్‌ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్‌ సెడ్డును శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచడానికి, వాతావరణంలో కాలుష్యం తగ్గించడానికి హరితహారం కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా కొన సాగిస్తున్నారన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని కోరారు. గన్నేరువరం మండలాన్ని జిల్లా లోనే ప్రథమ స్థానంలో నిలుపాలని పేర్కొన్నారు. దీని కోసం ఆయా గ్రామాల సర్పంచులు అధిక సంఖ్యలో మొక్కలు నాటించాలని, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలను స్వచ్ఛతకు నిలయాలుగా మార్చాలని సూచించారు. వీరి వెంట సర్పంచ్‌ కుమ్మరి సంపత్‌ ఉన్నారు.

గ్రామాల్లో స్వచ్ఛత
పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా మండలంలోని అన్ని గ్రామాలు పరిశుభ్రమై, గ్రామాల్లో స్వచ్ఛత నెలకొన్నదని మండల ప్రత్యేకాధికారి శ్రీమాల పేర్కొన్నారు. పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా శనివారం మండలంలోని ఖాసీంపేట గ్రామాన్ని ఆమె ఎంపీడీవో స్వాతితో కలిసి సందర్శించారు. గ్రామంలోని పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ గంప మల్లీశ్వరిని శాలువాతో సన్మానించారు. ప్రత్యేకాధికారి మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనులు చక్కగా జరిగాయని, ప్లాస్టిక్‌ నివారణ, పరిసరాల పరి శుభ్రతకు పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని కొనియాడారు. గ్రామ ప్రత్యేకాధికారి, ఏవో కిరణ్మయి, ఉపసర్పంచ్‌ సంపత్‌రెడ్డి, ప్యాక్స్‌ డైరెక్టర్‌ గంప వెంకన్న, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సిబ్బందికి సన్మానం
మండలంలో పల్లె ప్రగతి పనులు విజయవంతంగా ముగిశాయి. శనివారం జంగపెల్లిలో సర్పంచ్‌ అటికం శారదాశ్రీనివాస్‌ ఆధ్వర్యంలోపల్లె ప్రగతి పనులకు సహకరించిన సీఏలు అంజలి, సువర్ణ, ఆశ కార్యకర్తలు శ్యామల, లావణ్య, అంగన్‌వాడీ టీచర్లు సరోజన, రజిత ను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ గీకురు లతాఆంజనేయులు, ఎంపీటీసీ అటికం రాజేశం, నాయకుడు హన్మాండ్ల శ్రీనివాస్‌, వార్డు సభ్యులు, ప్రత్యేకాధికారి అభిషేక్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి లక్ష్మయ్య, కారోబార్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేకాధికారికి సన్మానం
మానకొండూర్‌ రూరల్‌, జులై 10: కొండపల్కల గ్రామంలో పల్లె ప్రగతిలో ప్రత్యేకాధికారిగా పని చేసిన మోహన్‌గౌడ్‌ను శనివారం సర్పంచ్‌ నల్ల వంశీధర్‌రెడ్డి, జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లగొండ తిరుపతి గౌడ్‌ సన్మానించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో ముగింపు సమావేశాలను నిర్వహించారు. రావుల శంకరాచారి, దాసరి రాజ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి సారయ్య ఉన్నారు.

ముగిసిన పల్లె ప్రగతి..
తిమ్మాపూర్‌ రూరల్‌, జూలై 10: పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని రేణికుంట గ్రామంలో శనివారం గ్రామ సభ నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని వివిధ పనులు చేసిన వారిని సర్పంచ్‌ కరివేద పద్మజ సన్మానించారు.

తిమ్మాపూర్‌లో..
తిమ్మాపూర్‌, జూలై 10: పది రోజులుగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా అన్ని గ్రామపంచాయతీల ఆవరణలో గ్రామాల్లో చేసిన పనులపై చర్చించారు. చేయాల్సిన పనులపై కార్యచరణ రూపొందించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు, కో ఆప్షన్‌ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ్రామాల్లో గణనీయమైన మార్పు
గ్రామాల్లో గణనీయమైన మార్పు
గ్రామాల్లో గణనీయమైన మార్పు

ట్రెండింగ్‌

Advertisement