e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home కరీంనగర్ కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీరు

కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీరు

  • సీఎం కేసీఆర్‌తోనే రైతాంగానికి న్యాయం
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌
  • తిమ్మాపూర్‌లో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, నుస్తులాపూర్‌లో రైతు వేదిక ప్రారంభం
  • హాజరైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌
కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీరు

తిమ్మాపూర్‌, జూలై 10: కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కోటి ఎకరాలకు సాగు నీరందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రశంసించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి శనివారం తిమ్మాపూర్‌లో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, స్వశక్తి సంఘ భవనం, నుస్తులాపూర్‌లో రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ, రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో 95 శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతుల మేలు కోసం పెట్టుబడి సాయం, రైతు బీమా, 24 గంటల కరెంట్‌ ఇస్తున్నదన్నారు. సాగులో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించేందుకే 5వేల ఎకరాలకు ఒక్కో క్లస్టర్‌గా విభజించి రైతు వేదికలు నిర్మించిందని చెప్పారు. అంతేకాకుండా ఏఈవోలను నియమించిందని పేర్కొన్నారు. అలాగే, ఇక్కడ భూసార పరీక్షలను ఉచితంగా చేసేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు.

రైతులు సర్కారు అమలు చేస్తున్న పథకాలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని అభిలషించారు. యాసంగిలో 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, పకడ్బందీ చర్యలతో కొవిడ్‌ను నియంత్రించామని చెప్పారు. మిగిలిన రాష్ర్టాలతో పోల్చితే కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించామన్నారు. అంతేకాకుండా అర్హులందరికీ ఉచిత వ్యాక్సినేషన్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను మహిళలు వినియోగించుకొని అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ, రైతులకు రైతు వేదికలు దేవాలయాలుగా, విజ్ఞాన కేంద్రాలుగా ఉపయోగపడుతాయన్నారు.

- Advertisement -

తెలంగాణ ఏర్పాటు తర్వాత భూముల విలువలు పెరిగిపోయాయని గుర్తు చేశారు. మానకొండూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి వినోద్‌కుమార్‌ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అనంతరం వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే రసమయిని ఘనంగా సన్మానించారు. ఎంపీపీ కేతిరెడ్డి వనిత, జడ్పీటీసీ ఇనుకొండ శైలజ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎలుక అనిత, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్‌ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు దుండ్ర రాజయ్య యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ గుజ్జుల రవీందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, సర్పంచులు ఇనుకొండ జితేందర్‌రెడ్డి, బోయిని కొమురయ్య, రావుల రమేశ్‌, దుండ్ర నీలమ్మ, మీసాల అంజయ్య, ఎంపీటీసీలు కొత్త తిరుపతిరెడ్డి, వేల్పుల మమత, చాడ తిలక్‌ ప్రియ, కవ్వంపల్లి పద్మ, మండల ప్రత్యేకాధికారి పద్మావతి, ఎంపీడీవో చింతల రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీవో కిరణ్‌కుమార్‌, ఏవో సురేందర్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ పాశం అశోక్‌రెడ్డి, పొరండ్ల సొసైటీ చైర్మన్‌ సింగిరెడ్డి స్వామిరెడ్డి, ఉప సర్పంచులు బేతి శ్రీనివాస్‌రెడ్డి, కేతిరెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

మీ భూములు మీకే..భయపడద్దు
తిమ్మాపూర్‌, జూలై 10: మీ భూములు మీకే ఉంటాయి..ఈ విషయంలో భయపడవద్దు.. అంటూ నుస్తులాపూర్‌ గ్రామస్తులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అభయమిచారు. కలెక్టర్‌తో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపారు. పల్లెప్రగతిలో పాల్గొనేందుకు వినోద్‌కుమార్‌ హైదరాబాద్‌ నుంచి తిమ్మాపూర్‌కు వస్తుండగా నుస్తులాపూర్‌ గ్రామస్తులు ఆయన్ను కలిశారు. ప్రభుత్వం 40 ఏండ్ల కిందట తమకు భూమి ఇవ్వగా సాగు చేసుకొని బతుకుతున్నామని, అయితే ఇటీవల ఇరిగేషన్‌ అధికారులు పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారని వినోద్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన వెంటనే కలెక్టర్‌కు ఫోన్‌ చేశారు. రైతుల భూముల జోలికివెళ్లవద్దని ఆదేశించారు. కాగా, సమస్యను పరిష్కరించిన వినోద్‌కుమార్‌కు నుస్తులాపూర్‌వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీరు
కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీరు
కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీరు

ట్రెండింగ్‌

Advertisement