e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home కరీంనగర్ అందరూ ఉత్తీర్ణులే..

అందరూ ఉత్తీర్ణులే..

అందరూ ఉత్తీర్ణులే..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు ప్రమోట్‌
ఉమ్మడి జిల్లాలో 40,600 మంది పాస్‌
20,965 మందికి 10 జీపీఏ
ఫలితాలు వెల్లడించిన సర్కారు

కమాన్‌చౌరస్తా/ సిరిసిల్ల టౌన్‌/ జగిత్యాలటౌన్‌/ పెద్దపల్లి కమాన్‌, మే 21: కరీంనగర్‌ జిల్లాలో 13312 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించగా, అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 6109 మంది బాలికలు, 7203 బాలురు మొత్తం 13,312 మంది విద్యార్థులు పైతరగతులకు అర్హత సాధించారు. ఇందులో 7668 మంది విద్యార్థులు 10 జీపీఏ, 969 మంది విద్యార్థులు 9.8 జీపీఏ సాధించారు. జిల్లాలో 354 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 25 పాఠశాలల్లో పూర్తిస్థాయి విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
జగిత్యాల జిల్లాలోని 226 ప్రభుత్వ, 108 ప్రైవేటు పాఠశాలల నుంచి పది పరీక్షలకు 12169 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందరూ ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 6359 మంది బాలురు, 5810 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3980 మంది బాలురు, 4101 మంది బాలికలు మొత్తం 8081 మంది కాగా, ప్రైవేటు పాఠశాలలో 2379 మంది బాలురు, 1709 మంది బాలికలు మొత్తం 4088 మంది ఉన్నారు. మొత్తంగా 6182 మంది 10 జీపీఏ సాధించగా, 984 మందికి 9.8 జీపీఏ, 763 మందికి 9.7 జీపీఏ, 665 మందికి 9.5 జీపీఏ వచ్చింది.
పెద్దపల్లి జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 8811 మంది పరీక్ష ఫీజులు చెల్లించగా వారంతా పాసైనట్లు జిల్లా విద్యాధికారి డాక్టర్‌ బీ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఇందులో 4523 మంది బాలురు కాగా, 4288 మంది బాలికలు ఉన్నట్లు చెప్పారు. కాగా, 4310 మంది 10 జీపీఏ సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను డీఈవోతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6308 విద్యార్థులుండగా (ఎఫ్‌ఏ 1 మార్కుల ఆధారంగా) ఆయా గ్రేడ్‌లలో ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2932 బాలురు, 3376 బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మొత్తం విద్యార్థులు 4902ఉండగా వీరిలో బాలురు 2163, బాలికలు 2739 ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలో 1406 విద్యార్థులు వీరిలో బాలురు 769, బాలికలు 637మంది ఉన్నారు. మొత్తంగా 2805 మంది విద్యార్థులు 10 జీపీఏ, 396 మంది 9.8 జీపీఏ, 372 మంది 9.7 జీపీఏ, 348 మంది 9.5జీపీఏ, 305 మంది 9.3 జీపీఏ, 316 మంది 9.2 జీపీఏ, 257 మంది 9.0 జీపీఏ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ అభినందించారు.

జిల్లా ఉత్తీర్ణులు బాలురు బాలికలు 10 జీపీఏ
కరీంనగర్‌ 13,312 7203 6109 7668
జగిత్యాల 12169 6359 5810 6182
పెద్దపల్లి 8811 4523 4288 4310
రాజన్న సిరిసిల్ల 6308 2932 3376 2805
మొత్తం 40,600 21017 19583 20,965

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అందరూ ఉత్తీర్ణులే..

ట్రెండింగ్‌

Advertisement