e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home కరీంనగర్ బుక్‌ చేస్తే అన్నీ ఇంటికే..

బుక్‌ చేస్తే అన్నీ ఇంటికే..

బుక్‌ చేస్తే అన్నీ ఇంటికే..

కూరగాయలే కాదు ఉప్పు, పప్పు.. మటన్‌, చికెన్‌ అన్నీ డెలివరీ
అందుబాటులో హోం సర్వీసులు
ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ మరమ్మతులు, సెలూన్‌, బ్యుటీషియన్‌ సేవలు
ఐటీ టవర్‌ కేంద్రంగా కార్యకలాపాలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌, మే 8: కూరగాయలు కావాలన్నా.. వంటింట్లోకి సరుకులు కావాలన్నా.. ఫోన్లో ఇలా క్లిక్‌ చేస్తే చాలు అలా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వీటి జాబితాలో హోం సర్వీసెస్‌ కూడా చేరిపోయింది. కరీంనగర్‌ కేంద్రంగా నగరంలో ఏ మూలకైనా కూరగాయలు, సరుకులే కాదు, ఇంటిలో అవసరమయ్యే వివిధ రకాల సేవలను కూడా అందిస్తున్నది ‘అర్బన్‌బై’. ఐటీ టవర్‌ కేంద్రంగా తన వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ స్టార్టప్‌ కంపెనీ, ఇప్పుడు అందరికీ చేరువవుతున్నది.
కరీం‘నగరానికి’ చెందిన పవన్‌ గట్టికొప్పుల, అనగంటి ప్రణయ్‌కుమార్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉన్నచోటే సొంతంగా ఏదైనా చేయాలని సంకల్పించారు. కరీంనగర్‌ కేంద్రంగా ముకరంపురలో 2019లో ‘అర్బన్‌బై’ హోం డెలివరీ స్టార్టప్‌ను ప్రారంభించారు. మొదట్లో బాగానే నడిచినా సరైన అవకాశాలు లేకపోవడంతో మూడు నెలల తర్వాత హైదరాబాద్‌కు మార్చి చూశారు. అక్కడా వ్యాపారం అంతంత మా త్రమే ఉండడంతో ఆలోచనలో పడ్డారు. అంతలోనే 2020 డిసెంబర్‌లో కరీంనగర్‌లో ఐటీ టవర్‌ను ప్రారంభించడంతో అర్బన్‌ బై సంస్థను మళ్లీ కరీంనగర్‌కు మార్చారు. ఐటీ టవర్‌లో వెయ్యి స్కేర్‌ ఫీట్ల స్థలం కేటాయించారు. మొదటల్లో హోం డెలివరీ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వగా, కస్టమర్లు పెరుగుతుండడంతో అన్ని రకాల సేవలను అందిస్తున్నారు.

డెలివరీలు.. హోం సర్వీసులు..
అర్బన్‌ బై సంస్థ ద్వారా ఇప్పుడు కూరగాయలు, పండ్లు, కిరాణ సామగ్రి, డ్రై ప్రూట్స్‌, మాంసం ఉత్పత్తులు, మెడికల్‌ టెస్టులే కాదు స్టేషనరీ, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, బ్యూటీషిషన్‌, సెలూన్‌ తదితర అన్ని సేవలను అందిస్తున్నారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ హోం ఐసోలేషన్‌లో ఉండే వారికి పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కరీం‘నగరం’లోని ఏ మూల నుంచైనా ఆర్డర్‌ వస్తే మార్కెట్‌లో 30 నుంచి 45 నిమిషాల్లోగా డెలివరీ చేస్తున్నామని, మార్కెట్‌లో ఉన్న ధరలే తీసుకుంటున్నాని చెబుతున్నారు.
25 మందికి ఉపాధి..300 షాపులతో అనుసంధానం
సంస్థలో 25 మందికిపైగా యువకులు ఉపాధి పొందుతున్నారు. ఆర్డర్‌ తీసుకోవడం.. సమాచారం అందించడం, డెలివరీ చేస్తుంటారు. అన్ని రకాల వస్తువులు సరఫరా చేసేందుకు ఈ స్టార్టప్‌ సంస్థను నగరంలోని 300కు పైగా దుకాణాలతో అనుసంధానం చేశారు. అర్బన్‌ బై యాప్‌ను గూగూల్‌ ప్లే నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని కావాల్సిన వస్తువును ఆర్డర్‌ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం రోజుకు వందకు పైగా ఆర్డర్లు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో మరింత పెంచుకుంటామని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బుక్‌ చేస్తే అన్నీ ఇంటికే..

ట్రెండింగ్‌

Advertisement