e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home కరీంనగర్ పురుగుల నివారణ చర్యలు చేపట్టండి

పురుగుల నివారణ చర్యలు చేపట్టండి

పురుగుల నివారణ చర్యలు చేపట్టండి

కమాన్‌చౌరస్తా, ఏప్రిల్‌ 5: కార్పొరేషన్‌ పరిధిలోని అల్గునూర్‌ శివారులోగల కాకతీయ కెనాల్‌ వద్ద పురుగుల నివారణకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.శశాంక సూచించారు. ఆయన సోమవారం ఉదయం సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి కాకతీయ కెనాల్‌ వద్ద పురుగులు వస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్సారెస్పీ, కార్పొరేషన్‌, ఆర్‌అండ్‌బీ, పోలీస్‌, ఫైర్‌ అధికారులతో మాట్లాడారు. కెనాల్‌కు నలుదిక్కులా లైట్లు అమర్చాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ డీఈని ఆదేశించారు. కెనాల్‌ చుట్టుపక్కల ఉన్న పిచ్చిమొక్కలు, నిల్వనీటిని ఎక్స్‌కవేటర్‌తో తొలగించాలని హెచ్‌ఆర్‌కే, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి అరగంటకు ఒకసారి పురుగుల మందు స్ప్రే చేయాలని, ఇందుకు ఫైర్‌ విభాగం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వంతెన పక్కన ఉన్న నీటిలో లార్వా పెరగకుండా గంబూషి యా చేపపిల్లలను వదలాలన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్పొరేటర్‌ సల్లా శారదారవీందర్‌, కేడీసీసీబీ డైరెక్టర్‌ సింగిరెడ్డి స్వామిరెడ్డి, డీఏవో శ్రీధర్‌, మున్సిపల్‌ డీఈఈ వామన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రమేశ్‌, నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
ఫలించిన హైమాస్ట్‌ లైట్‌ ప్రయోగం
కాకతీయ కెనాల్‌ వద్ద పురుగుల కోసం ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్ల ప్రయోగం ఫలించింది. సోమవారం రాత్రి సమయంలో పురుగులు తక్కువగా కనిపించాయి. ఉదయం కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు భాగస్వాములయ్యారు. కాకతీయ కెనాల్‌ వద్ద సీఐ శశిధర్‌ రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ తిరుమల్‌గౌడ్‌, ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీతో పాటు, వాహనదారులకు సలహాలు, సూచనలు చేశారు. రహదారిపై వచ్చే వాహనాలను ఆపి హెల్మెట్‌ ధరించాలని, పురుగుల తీవ్రత ఉన్నదని సూచించారు. హెల్మెట్లు లేని వారికి హెల్మెట్లు అందజేశారు. వాహనాలు వేగంగా వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రాఫిక్‌ పోలీసులతో పాటు, ఎల్‌ఎండీ పోలీసులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

బ్రిటానియాకు షాక్‌: ఐటీసీపై కేసు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

క‌రోనా రెండో వేవ్ క‌ల‌క‌లం: రూ.4 ల‌క్ష‌ల కోట్లు హాంఫ‌ట్‌!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పురుగుల నివారణ చర్యలు చేపట్టండి

ట్రెండింగ్‌

Advertisement