e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home కరీంనగర్ అశోక్‌కు దాతల ఆపన్నహస్తం

అశోక్‌కు దాతల ఆపన్నహస్తం

అశోక్‌కు దాతల ఆపన్నహస్తం

రూ. 60 వేల ఆర్థిక సాయం
ట్విట్టర్‌ ద్వారా స్పందించినఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మెరుగైన చికిత్స చేయిస్తానని భరోసా

కరీంనగర్‌ రూరల్‌: ఏప్రిల్‌ 2: కాలు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్న దుర్శేడ్‌ గ్రామానికి చెందిన తూర్పాటి అశోక్‌కు దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. అశోక్‌ను ఆదుకోండి శీర్షికన ‘నమస్తే’ మినీలో గత నెల 28న ప్రచురితమైన కథనానికి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా అశోక్‌ చికిత్సకు భరోసానిచ్చారు. వెంటనే నిమ్స్‌లో చేర్పించాలని స్థానిక జాగృతి నాయకులకు సూచించారు. ఈ మేరకు కుటుంబీకులు శనివారం అశోక్‌ను హైదరాబాద్‌ నిమ్స్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెద్దపల్లికి చెందిన తెలంగాణ జాగృతి నేత సాయి కిశోర్‌గౌడ్‌ అశోక్‌కు శుక్రవారం రూ. 25 వేల నగదు అందించారు. గ్రామానికి చెందిన వాట్సాప్‌ మిత్రులు సోషల్‌ మీడియాలో అతడి దయనీయస్థితిపై ప్రచారం చేశారు. ఈ మేరకు పలువురు ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా రూ. 15 వేలు అశోక్‌ బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. కరీంనగర్‌ రూరల్‌ ఠాణాకు చెందిన బ్లూకోల్ట్‌ సిబ్బంది రూ. 5 వేలు, గాజుల వెంకటమ్మ, న్యాలం రవి, ఉప సర్పంచ్‌ సుంకిశాల సంపత్‌రావు రూ .2 వేల చొప్పున, గౌడ ప్రభాకర్‌, ధర్మపురి రాజవీరు, నందల తిరుపతి, వేముల ఆశోక్‌, మధుసూదనాచార్యులు, నేరెళ్ల రమేశ్‌ (పొలీసు), భాస్కర్‌, వేముల రాంచందర్‌, కోరుకంటి రామారావు, కోరుకంటి సత్యనారాయణరావు, శ్రీ రామోజు సత్యనారాయణ, శ్రీరామోజు రవీంద్రాచారి, తిరుపతి రూ. వెయ్యి చొప్పున అందజేశారు.

ఇవి కూడా చూడండి..

పాములు, ఎలుకలు, పిల్లుల వ‌ల్ల‌.. ల‌క్షా 30 వేల కోట్ల డాల‌ర్ల న‌ష్టం

లింగ సమానత్వంలో అట్టడుగులో భారత్‌.. ఐస్లాండ్‌కు తొలిస్థానం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అశోక్‌కు దాతల ఆపన్నహస్తం

ట్రెండింగ్‌

Advertisement