కార్పొరేషన్ : చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్ చౌరస్తాలో ఉన్న ఆమె విగ్రహానికి కలెక్టర్ కర్ణన్, నగర మేయర్ సునీల్రావులతో కలిసి మంత్రి కమలాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా జరపాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్, కార్పొరేటర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.