ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూట్యూబ్ కళాకారులు ఆదివారం వేములవాడలోని బద్ది పోచమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. యూట్యూబ్, గూగుల్‌తో ఉపాధి పొందుతున్న కళాకారులు ఆయా సంస్థల తరఫున కళాకారులు తరలివచ్చారు. యువతులు నెత్తిన బోనాలు ఎత్తుకుని రాగా, పెద్దసంఖ్యలో తరలివచ్చిన కళాకారుల ఆటపాటలతో వేములవాడ పట్టణం మార్మోగింది.
భక్తిశ్రద్ధలతో బోనాల జాతర నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ జానపదకళాకారుడు మాట్ల తిరుపతి, రాజ్నరేంద్ర, తేలు విజయ, స్వర్ణ, మధుప్రియ, మౌనికయాదవ్, జీఎల్ నాందేవ్, మామిడి మౌనిక, శిరీష, వడ్లకొండ అనిల్, మల్లిక్‌తేజ, బుర్ర నటరాజ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
-వేములవాడ టౌన్, ఫిబ్రవరి 5