e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home కరీంనగర్ ‘కరీంనగర్‌ డెయిరీ దేశానికే ఆదర్శం’

‘కరీంనగర్‌ డెయిరీ దేశానికే ఆదర్శం’

కరీంనగర్‌, జూలై 30 (నమస్తే తెలంగాణ): కరీంనగర్‌ డెయిరీ దేశానికే ఆదర్శమని, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అభినందించారు. శుక్రవారం కలెక్టర్‌ కరీంనగర్‌ డెయిరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్‌ డెయిరీ రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. 20 సంవత్సరాల క్రితం డెయిరీ నష్టాల్లో ఉండేదని, పాలకవర్గం చేపట్టిన సంస్కరణలతో ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తున్నదన్నారు. కరీంనగర్‌ డెయిరీని ఇతర జిల్లాల్లో కూడా విస్తరించాలని చైర్మన్‌కు కలెక్టర్‌ సూచించారు. దీని వల్ల యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, గ్రామీణ ప్రాంత పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని పేరొన్నారు. తిమ్మాపూర్‌ మండలం నల్లగొండలో మూడు లక్షల లీటర్ల సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డెయిరీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం డెయిరీలో పాల ఉత్పత్తుల తయారీ, పాల ప్యాకెట్ల ప్యాకింగ్‌ యూనిట్లను చైర్మన్‌ కలెక్టర్‌కు చూపించారు. పాడి రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో డెయిరీ చైర్మన్‌ సీహెచ్‌ రాజేశ్వర్‌రావు, జిల్లా పరిషత్‌ సీఈవో ప్రియాంక, డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శంకర్‌రెడ్డి, అడ్వైజర్‌ వీ హనుమంతరెడ్డి, డైరెక్టర్లు ప్రభాకర్‌రావు, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూరగాయల మారెట్లు శుభ్రంగా ఉంచాలి
కార్పొరేషన్‌, జూలై 30: నగరంలోని కూరగాయల మారెట్లలో పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. నగరంలోని శనివారం మారెట్‌లో గల రైతుబజార్‌ను శుక్రవారం ఆయన మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి పరిశీలించారు. ఉదయం ఎన్ని గంటలకు మార్కెట్‌కు వస్తారు… ఎప్పుడు తిరిగి వెళ్తారు, తీసుకొచ్చిన కూరగాయలు, రవాణా సౌకర్యాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి రైతు తప్పనిసరిగా వారికి కేటాయించిన గద్దెలపై కూర్చొని కూరగాయలు విక్రయించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో చేపడుతున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే, కేబుల్‌ బ్రిడ్జి పనుల పురోగతిని పరిశీలించారు.మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్‌ బండారి వేణు, నాయకులు ఆకుల నర్సయ్య, జిల్లా మారెటింగ్‌ అధికారి పద్మావతి, వ్యవసాయ మారెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎలుక అనితాఆంజనేయులు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ శివకుమార్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana