e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home కరీంనగర్ పారమిత విద్యార్థులకు జాతీయ స్థాయి పురస్కారం

పారమిత విద్యార్థులకు జాతీయ స్థాయి పురస్కారం

కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్‌ 26: జిల్లా కేంద్రంలోని పారమిత విద్యార్థులు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రతిష్టాత్మక సీఎస్‌ఐఆర్‌ జాతీయ స్థాయి ఉత్తమ ఆవిషరణ పురసారం అందుకున్నారని విద్యాసంస్థల చైర్మన్‌ ఈ.ప్రసాద్‌రావు తెలిపారు. ఆదివారం పాఠశాల ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని పద్మనగర్‌ పారమిత హెరిటేజ్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు గుర్రం అనుదీప్‌, సయ్యద్‌ మెహతాబ్‌ 2021 సంవత్సరానికి గాను సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసర్చ్‌) నిర్వహించిన ప్రతిష్టాత్మక జాతీయస్థాయి ఆవిషరణ పోటీల్లో ఉత్తమ ఆవిషరణను ప్రదర్శించి జాతీయస్థాయిలో మొదటి బహుమతిని పొందారని తెలిపారు. ఆదివారం సీఎస్‌ఐఆర్‌ ఫౌండేషన్‌ డే సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర శాస్త్రసాంకేతికశాఖ మంత్రి జితేందర్‌సింగ్‌ చేతుల మీదుగా ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులు అవార్డును అందుకున్నారని పేర్కొన్నారు. అనుదీప్‌, మెహతాబ్‌, గైడ్‌ టీచర్‌ లలిత్‌ మోహన్‌ సాహు మార్గదర్శకత్వంలో రూపొందించిన ‘మ్యాజికల్‌ హెక్సాగన్‌’ (మాయాశడ్భుజి) దేశంలోని దాదాపు 15 లక్షల పాఠశాలలను ఎదురొని జాతీయస్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను గెలుచుకున్నదని తెలిపారు. ఈ యంత్రాన్ని క్షేత్ర పరిశోధన కోసం భారతీయ వరి పరిశోధన సంస్థకు తీసుకెళ్లగా, సంస్థ డైరెక్టర్‌ ఎస్‌ఆర్‌ వోలేటి యంత్ర సామర్థ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, గైడ్‌ టీచర్‌ను విద్యాసంస్థల చైర్మన్‌, డైరెక్టర్లు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రశ్మిత, వినోద్‌రావు, అనుకర్‌రావు, వీయూఎం ప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ అషువాద్వా, వైస్‌ ప్రిన్సిపాల్‌ బాలాజీ, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రైతులకు చేరువయ్యేలా..
మ్యాజికల్‌ హెక్సాగన్‌ సూత్రం ద్వారా విద్యార్థులు తయారుచేసిన ఈ యంత్రం ముఖ్యంగా పేద రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. ఈ యంత్రం వినూత్నంగా తకువ ధరకు, ఎకడికైనా సులభంగా తీసుకువెళ్లడానికి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఉత్పాదక వ్యవసాయ హార్వెస్టర్లను అందించడం, డిజైన్‌ చేసిన నమూనా వ్యవసాయ రంగంలో దున్నడానికి, లెవలింగ్‌ చేయడానికి, అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుందన్నారు. వరికోత కోయగా మిగిలిన వ్యర్థాలను కాల్చివేయకుండా ఈ యంత్రం పరిషారం చూపిస్తుందని వివరించారు. రైతులు పంటలను కోసిన తర్వాత ఉండే కొయ్యలను కాల్పడం ద్వారా ఎదురయ్యే కాలుష్యాన్ని ఈ యంత్రం ద్వారా నియంత్రించవచ్చని వివరించారు. మ్యాజికల్‌ హెక్సాగన్‌ను 2018లో తయారు చేసినట్లు చెప్పారు. అప్పుడు మొదట జిల్లా సైన్స్‌ ఫేర్‌ నుంచి సీఎస్‌ఐఆర్‌ ఇన్నోవేషన్‌ అవార్డు వరకు వెళ్లిందని హర్షం వ్యక్తం చేశారు. దీని ప్రయాణం జిల్లా, రాష్ట్ర, దక్షిణ భారత, జాతీయస్థాయి (JANSMEE ), జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌, ఐఆర్‌ఐఎస్‌ Mentoring Camp (ప్రీ ఇంటర్నేషనల్‌), ఐఆర్‌ఐఎస్‌ సైన్స్‌ఫేర్‌, ఇండస్ట్రియల్‌ మనాక్‌ నేషనల్‌ సైన్స్‌ఫేర్‌, చివరగా సీఎస్‌ఐఆర్‌ జాతీయస్థాయి ఇన్నోవేషన్‌ అవార్డులో ప్రథమ స్థానం పొంది తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచిందని వివరించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement