e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home కరీంనగర్ తారకరాముడికి హరితభిషేకం

తారకరాముడికి హరితభిషేకం

అభిమానులు, టీఆర్‌ఎస్‌ నాయకుల ఆశీస్సులు
పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు
కేకులు కట్‌ చేసి, మొక్కలు నాటి సంబురాలు
పాల్గొన్న మంత్రులు కొప్పుల, గంగుల, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, ఎంపీ వెంకటేశ్‌నేతకాని
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

కరీంనగర్‌, జూలై 24 (నమస్తే తెలంగాణ): అమాత్యుడు కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలను అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. పల్లె.. పట్నం అనే తేడా లేకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేకులు కోసి సంబురాలు చేసుకున్నారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఊరూరా మొక్కలు నాటారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పేదలు, వృద్ధులకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం చేసి అభిమానం చాటుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై, తమ ప్రియతమ నాయకుడు నిండు నూరేండ్లూ వర్ధిల్లాలని మనసారా కోరుకున్నారు. కాగా, ఆయాచోట్ల మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

- Advertisement -

నగరంలోని తెలంగాణ చౌక్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ సునీల్‌రావు, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ రోడ్డు, చింతకుంటలోని గాంధీనగర్‌లో మొక్కలు నాటారు. చొప్పదండి మండలం వెదురుగట్టలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌, పెద్దపల్లి ఎంపీ బోడగుంట వెంకటేష్‌ నేతకాని, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి స్థానిక కేసీఆర్‌ వనంలో మొక్కలు నాటారు. అలాగే, చింతకుంటలోని డబుల్‌ బెడ్రూం ఇండ్ల వద్ద, పోలీసు శిక్షణా కేంద్రంలోనూ మంత్రి గంగుల, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేతకానితో కలిసి సంతోష్‌కుమార్‌ మొక్కలు నాటారు. అనంతరం రామడుగు మండలం వెలిచాల గ్రామానికి వెళ్లి కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. వీణవంక లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, తిమ్మాపూర్‌లో మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కేక్‌లు కట్‌ చేసి మొక్కలు నాటారు. హుజూరాబాద్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌ రావు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీరితో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, పలుగ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్‌లు కట్‌ చేసి, స్వీట్లు పంచుకున్నారు.

యువనాయకుడు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు వేడుకలు ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరిగాయి. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ఇచ్చిన పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చనలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ఔత్సాహికులు, వృక్ష ప్రేమికులు పాల్గొని పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. నాటిన మొక్కలతో సెల్ఫీ దిగి, యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. అంతే కాకుండా, పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana