e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home కరీంనగర్ పేద కుటుంబాలకు వరం

పేద కుటుంబాలకు వరం

పేద కుటుంబాలకు వరం

దేశంలో ఒక్క తెలంగాణలోనే అమలు
మహిళా సాధికారతే లక్ష్యంగా అనేక పథకాలలో ప్రాధాన్యం lమంత్రి గంగుల కమలాకర్‌
కరీంనగర్‌లో 242 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కార్పొరేషన్‌, మే 25: పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి.. షాదీ ముబారక్‌ ఓ వరమని, దేశం లో మరెక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఉద్ఘాటించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో కల్యాణలక్ష్మి పథ కం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి, మాట్లాడారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు, కూలీలు వ్యవసాయ, బీడీ కార్మికులు ఒంటరి మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందిస్తున్నదని చెప్పారు.

గతంలో కరెంట్‌ సరఫరా లేక రైతులు అనేక ఇబ్బందులు పడేవారని, ఆ సమస్య ఇప్పుడు లేదని, 24 గంట ల పాటు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఎండాకాలంలో నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు అనేక ప్రాజెక్టుల ద్వా రా సాగునీరు అందించారన్నారు. కరోనా కాలం లో కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తు న్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. మహిళ సాధికారతే లక్ష్యంగా ప్రతి పథకంలో డబుల్‌ బెడ్‌రూం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఆసరా పింఛన్లలో ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పా రు. బంగారు తెలంగాణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభు త్వం పని చేస్తున్నదని, కేసీఆర్‌ను నిండునూరేళ్లు బాగుండాలని మహిళలంతా దీవించాలని కోరారు. 242మంది లబ్ధిదారులకు 2.42 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. త్వరలోనే మరో 622 మందికి చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్‌ వై సునీల్‌రావు, ఆర్‌డీఓ ఆనంద్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్రరాజు, కరీంనగర్‌ రూరల్‌ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మ య్య, కొత్తపల్లి జడ్పీటీసీ కరుణ రవీందర్‌, శ్యాం సుందర్‌రెడ్డి, సంపత్‌రావు, కార్పొరేటర్లు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేద కుటుంబాలకు వరం

ట్రెండింగ్‌

Advertisement