e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home కరీంనగర్ అన్నంపెట్టిన కేసీఆర్‌కు అండగా నిలుద్దాం

అన్నంపెట్టిన కేసీఆర్‌కు అండగా నిలుద్దాం

గీత కార్మికులకు ప్రత్యేక గుర్తింపు
ఎక్సైజ్‌ శంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి
ఆడబిడ్డలు నిండుమనసుతో దీవించాలి మంత్రి గంగుల కమలాకర్‌
గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయం
మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హుజూరాబాద్‌లో పర్యటన

హుజూరాబాద్‌/హుజూరాబాద్‌ టౌన్‌, జూలై 23: అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు పనిచేస్తున్నదని, అన్నం పెట్టిన సీఎం కేసీఆర్‌కు అండగా నిలుద్దామని రాష్ట్ర ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌లో మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని సాయిరూప గార్డెన్స్‌లో గీత కార్మికులకు అభయహస్తం చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎక్సైజ్‌ భవనాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్‌ సిటీ సెంటర్‌లో 68 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మనలాంటి పథకాలు బీజేపీ, ఇతర పార్టీల పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌తోనే ఇంటింటికీ లబ్ధి చేకూరుతున్నదని, దానిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ లబ్ధి చేకూరిందని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఉద్ఘాటించారు. అన్నం పెట్టిన సీఎం కేసీఆర్‌ను మరువద్దని, ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్‌కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలోనే గీత కార్మికులకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ పట్టణ పరిధిలోని కేసీ క్యాంపులో మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సాయిరూప గార్డెన్స్‌లో బాధిత గీత కార్మిక, ముదిరాజ్‌ కుటుంబాలకు అభయహస్తం చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం హుజూరాబాద్‌ సిటీ సెంటర్‌ హాల్‌లో 68 మందికి రూ.68లక్షల 80వేల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెకులు అందజేశారు.

- Advertisement -

ఆ తర్వాత మహిళా సంఘ భవనం కోసం 20గుంటల భూమి, నిర్మాణానికి రూ.కోటి నిధుల మంజూరు పత్రాన్ని మంత్రులు మహిళా సంఘ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ, 196 మంది గీత కార్మికుల కుటుంబాలకు రూ.3 కోట్ల చెకులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. అన్నం పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నడూ మరువవద్దని సూచించారు. ఆంధ్రాప్రాంతంలో కొబ్బరి చెట్లు కూలితే పరిహారం ఇచ్చేవారని, తెలంగాణలో తాటిచెట్టు పై నుంచి పడ్డా కూడా గౌడ కులస్తులకు పరిహారం ఇచ్చేందుకు గత పాలకులకు చేతులు వచ్చేవి కావన్నారు. కేసీఆర్‌ వచ్చాక లబ్ధి పొందని కుటుంబమంటూ రాష్ట్రంలో లేదని, ప్రతి కుటుంబం ఏదో పథకం ద్వారా లబ్ధి పొందుతున్నదని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో రూ.8కోట్లతో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, తాటి బెల్లం ఉత్పత్తులకు నల్గొండలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ విజయవంతమైతే మరికొన్ని జిల్లాలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేవని, దీనిపై ప్రశ్నించాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే నంబర్‌ వన్‌ స్థాయికి రాష్ర్టాన్ని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెంచి ఆకలి కేకలను సంపూర్ణంగా తెలంగాణ నుంచి పారదోలిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్‌ బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఇవన్నీ చేసిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మరో 20ఏళ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ అధికారంలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని కోకాపేటలో రూ.300 కోట్ల విలువైన స్థలాన్ని ఐదెకరాల చొప్పున ప్రతి కుల సంఘానికి ఇచ్చారని పేర్కొన్నారు. బీసీ కులాల ఆత్మ గౌరవం కోసం అన్ని కులాలతో పాటు హుజూరాబాద్‌లో గౌడ కులస్తులకు ఎకరం భూమి, గౌడ కమ్యూనిటీహాల్‌ కోసం రూ.కోటి సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారన్నారు.

అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో ప్రశ్నించాలన్నారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నదన్నారు. అన్ని విధాలుగా అండగా నిలబడి అన్నం పెడుతున్న కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలకు అన్ని రకాలుగా అండగా ఉంటున్న ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవించాలని కోరారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ, తెలంగాణను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ఎస్సీ, బీసీల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలను కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. అనంతరం టీఎన్‌జీవో భవనంలో టీఎన్‌జీవో నాయకులతో ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీలు బస్వరాజ్‌ సారయ్య, నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్‌ పర్సన్‌ కనుమల్ల విజయ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌ పర్సన్‌ కొలిపాక నిర్మల, గౌడ సంఘం నాయకులు, ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు.

సభ్యుల సమస్యలకు స్వస్తి
మెప్మా సభ్యులం వారానికి ఒక్కసారైన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. అలాంటిది సరైన స్థలం, మీటింగ్‌ హాల్‌ లేక ఇబ్బంది పడేవాళ్లం. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని అడిగిన వెంటనే బిల్డింగ్‌, నిధులను మంజూరు చేయడంతో ఇక నుంచి మా సమస్యలకు స్వస్తి పలికినట్లయింది. కోరిన వెంటనే వరాలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజంగా దేవుడి వలె ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. వచ్చే ఎన్నికల్లో మెప్మా సభ్యులందరం అధికార పార్టీకి అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.
బింగి సరస్వతి, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు, (హుజూరాబాద్‌ టౌన్‌)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana