e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home కరీంనగర్ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను బొందపెట్టాలి

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను బొందపెట్టాలి

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
జేఏసీ చైర్మన్‌ గజ్జెల కాంతం

హుజూరాబాద్‌ టౌన్‌, జూలై 23: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను బొందపెట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని జేఏసీ చైర్మన్‌ గజ్జెల కాంతం పిలుపునిచ్చారు. పట్టణంలోని సాయిరూప ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ తెలంగాణ అం బేదర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఐదు మండలాల స్థాయి రాజ్యాంగ రక్షణ సదస్సు కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంబేదర్‌ రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మా ర్చి దాని స్థానంలో మను ధర్మాన్ని తీసుకొని రా వాలని చేస్తున్న కుట్రలను, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను కాల రాయాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు తెలంగాణ వ్యాప్తంగా రా జ్యాంగ రక్షణ సదస్సులను ఏర్పాటు చేస్తూ మరో పోరాటానికి ప్రజలను సిద్ధం చేస్తున్నామ న్నారు. ఈటల రాజేందర్‌కు బహుజనుల మీద చిత్తశుద్ధి ఉంటే వారి హకులను కాలరాయాలని చూస్తున్న బీజేపీలో ఎలా చేరుతారని ప్రశ్నించారు. ఇందుకే హు జూరాబాద్‌లో ఈటలకు ప్రజలు తగి న బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు బలపడకుండా ఉండేందుకే ఆగస్టు 28న హుజూరాబాద్‌లో రాజ్యాంగ రక్షణ యుద్ధం బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని, హుజూరాబాద్‌లోని ఐదు మండలాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలంతా ఇళ్లకు తాళాలు వేసి వేలాదిగా తరలిరావాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒకరూ ముందుకు రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్‌, రాష్ట్ర వరింగ్‌ ప్రెసిడెంట్‌ బొంకూరి, సురేందర్‌సన్ని, కొమ్ము తిరుపతి, సముద్రాల అజయ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు తునికి సమ్మయ్య, మండలాధ్యక్షుడు జిన్నారపు ప్రవీణ్‌, టౌన్‌ అధ్యక్షుడు ముక శ్రీనివాస్‌, గజ్జెల ఆనందరావు, కొండ్ర స్వరూప, సుద్దాల లక్ష్మణ్‌, ములల గంగారాం, పాండు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana