e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home కరీంనగర్ కేక్‌ కట్‌ చేసి..రక్తదానం చేసి

కేక్‌ కట్‌ చేసి..రక్తదానం చేసి

కేక్‌ కట్‌ చేసి..రక్తదానం చేసి

ఘనంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ జన్మదినం
నగరవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
రక్తదానాలు..ఆలయాల్లో పూజలు

కార్పొరేషన్‌, జూలై 22: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జన్మదిన వేడుకలను నగరవ్యా ప్తం గా గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పలుచోట్ల కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్‌ పొన్నం అనిల్‌కుమార్‌ గౌడ్‌ ఆధ్వ ర్యంలో స్థానిక మార్కెట్‌ రోడ్డులోని వేంకటే శ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. మేయ ర్‌ సునీల్‌రావు చేతుల మీదుగా పేదలకు అల్పాహా రం అందజేశారు. స్మార్ట్‌సిటీ ప్రదాత వినోద్‌ నిం డు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇక్కడ నేతలు పబ్బతి శ్రీనివా స్‌రెడ్డి, ఆరె రవిగౌడ్‌, నారదాసు వసంతరావు, చంద్రం, జెల్లోజి శ్రీనివాస్‌, చుక్క శ్రీనివాస్‌, మా డిశెట్టి అజయ్‌, అఫ్రోజ్‌, శనిగరపు సతీశ్‌, చంద్రశేఖర్‌, రవినాయక్‌, మున్నా, ఉపేందర్‌, శ్రీధర్‌, మోహన్‌, వినోద్‌ ఉన్నారు.
తెలంగాణచౌక్‌లో టీఆర్‌ఎస్‌ నేత చల్ల హరిశంకర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను మేయర్‌ సునీల్‌రావు కట్‌ చేశారు. ప్రజలకు పూ లు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, కార్పొరేటర్లు తోట రాములు, వాల రమణరావు, గందె మాధవి, ఐలేందర్‌యాదవ్‌, గుగ్గిళ్ల జయశ్రీ, గంట కళ్యాణి, నాయకులు కర్ర రాజశేఖర్‌, సత్తినేని శ్రీనివాస్‌, దుర్గం మురళి పాల్గొన్నారు.
ప్రజాసంఘాల జేఎసీ ఆధ్వర్యంలో నిర్వ హిం చిన వేడుకల్లో రాష్ట్ర చైర్మన్‌ గజ్జెల కాంతం, కార్పొరేటర్‌ కంసాలశ్రీనివాస్‌, తోడేటి బాబు, గోసిక శంకర్‌, గసికంటి కుమార్‌, మైసాని మనోహర్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్వీ నేత జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 61 కిలోల కేక్‌ను మేయర్‌ సునీల్‌రావు కట్‌ చేశారు. చెన్నాడి దవాఖానలో తలసేమియా రోగుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించగా 30 మంది రక్తదానం చేశారు. వైద్యులు అమిత్‌కుమార్‌, మధుసూదన్‌రెడ్డి, సాజిద్‌ఖాన్‌, సాయికృష్ణ, పద్మయ్య, సంపత్‌, ప్రశాంత్‌, ఓం కార్‌, సతీశ్‌, దీపక్‌, రాజు, కల్యాణ్‌ ఉన్నారు.
ముకరంపురలోని హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సర్కారు దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు సాయి, వాణి, గందె కల్పన, రుద్ర రేణుక, రాధ, శోభ, మల్లికార్జున్‌, మహేశ్‌, కరుణాకర్‌, సందీప్‌, స్వామి, మధు పాల్గొన్నారు.
ప్రజాగాయని వొల్లాల వాణి ఆధ్వర్యంలో నియో స్వచ్ఛంద సంస్థ అనాథశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. సాయికృష్ణ, గందె కల్పన, గంటల రేణుక, రుద్ర రాధ, శోభ, మురళి, ఓంకార్‌ ఉన్నారు.
వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో..
విద్యానగర్‌ జూలై 22: ఎస్సారార్‌ కాలేజీ గ్రౌం డ్‌లో వాకర్స్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. జ్యో తిబాఫూలే సంఘం జిల్లా అధ్యక్షుడు వంగ వెంకటేశ్వర్లు జగన్‌గౌడ్‌, జకుల మల్లేశంగౌడ్‌, రవిగౌ డ్‌, లింగయ్య, రఘు, నారాయణరెడ్డి, భా సర్‌, శంకరయ్య, రాములు, తిరుపతిరావు ఉన్నారు.
మార్కెట్‌ కమిటీలో..
కొత్తపల్లి/ కరీంనగర్‌ రూరల్‌ జులై 22: కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అనితా ఆంజనే యు లు ఆధ్వర్యంలో హమాలీలు, రైతుల కు అన్నదా నం చేశారు. ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గుజ్జుల రవీందర్‌ రెడ్డి, డైరెక్టర్‌ సాదుల వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నేత కొలిపాక మల్లికార్జున్‌, సాజిత్‌ఖాన్‌ పాల్గొన్నారు.
తెలంగాణచౌక్‌,జూలై22: వినోదన్న యువసేన రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జీఎస్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో కేక్‌ కట్‌ చేసి పం పిణీ చేశారు. బాటసారులకు మొక్కలు అందించారు. ఇక్కడ రవికుమార్‌, ప్రభాకర్‌, గౌస్‌, మహేందర్‌, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేక్‌ కట్‌ చేసి..రక్తదానం చేసి
కేక్‌ కట్‌ చేసి..రక్తదానం చేసి
కేక్‌ కట్‌ చేసి..రక్తదానం చేసి

ట్రెండింగ్‌

Advertisement