e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home కరీంనగర్ ఈటలది ఫ్యూడల్‌ మనస్తత్వం

ఈటలది ఫ్యూడల్‌ మనస్తత్వం

ఈటలది ఫ్యూడల్‌ మనస్తత్వం

ధన అహంకారంతోనే పథకాలపై అక్కసు
తప్పుడు ఆరోపణలతో సానుభూతి వస్తుందన్నది ఆయన భ్రమే
బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

హుజూరాబాద్‌, జూన్‌ 22: కేసీఆర్‌ పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వ్యం గంగా మాట్లాడడం ఈటల ఫ్యూడల్‌ మనసత్వానికి, కుంచిత ఆలోచనలకు తార్కాణమని బీసీ క మిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పథకాలపై చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ధన అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. పరిగె ఏరుకోవడం, సోమరులను చేస్తుండడం అంటూ పదేపదే మాట్లాడడం పేదల ను కించపరచడమేనని మండిపడ్డారు. పేదలంటే అమితమైన ప్రేమ, అభిమానాన్ని ప్రదర్శిస్తున్నట్లు చేయడం కేవలం ఈటల నటన మాత్రమేనన్న వి షయాన్ని ప్రజలు తెలుసుకోవాలని సూచించా రు. దమ్ముంటే కేంద్రంతో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడన్నా సంక్షేమ పథకాలు అమలు చేసేలా కృ షి చేస్తే పేదలకు మేలు చేసినవారవుతారని హితవుపలికారు. పేదలు ఆత్మగౌరవంతో, సమాజం లో తలెత్తుకొని బతికేలా మహోన్నత లక్ష్యంతో కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలను ఈటల హేళ న చేయడాన్ని చూస్తే పేదలపై ఆయనకున్న అభిమానం ఏమిటో అర్థం చేసుకోవచ్చునన్నారు. మ హోన్నతమైన కేసీఆర్‌పై ఈటల రాజేందర్‌, బీ జే పీ నేతలు చేస్తున్న విమర్శలు వారి దిగజారు డుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలకు కారణం ఈటల మాత్రమేనని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తోసిరాజని రాజీనామా చేసి వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఇదీ పక్కన బెట్టి ఉప ఎన్నికలు తె లంగా ణ ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్నవని చెప్పడాన్ని చూస్తే తిన్నింటి వా సాలు లెక్క పెట్టే మనసత్వత్వంగా అర్థమవుతున్నదన్నారు.

తమ్ముడిలా దగ్గరికి తీసుకొని పెద్ద చేస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు.. కేసీఆర్‌పై ఏది పడితే మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారనే విషయం ఈటల తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు పాలన మొదలుకొని కిరణ్‌కుమార్‌రెడ్డి 20 ఏండ్లలో బీసీల కోసం కేవలం రూ.14 వేల కోట్లు ఖర్చు పెడి తే.. సీఎం కేసీఆర్‌ కేవలం ఏడేళ్లల్లోనే రూ.20వేల కోట్ల వరకు వెచ్చించారని గుర్తు చేశారు. 2021-22 రాష్ట్ర బడ్జెట్‌ చిన్నాభిన్నం ఉన్నప్పటికినీ పేదల అభివృద్ధి సంక్షే మం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకడు గు వేయకుండా తన నిబద్ధతను, నిజాయితీని చా టుకుంటున్నదని చెప్పారు. వెయ్యి కోట్లతో కొత్తగా సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకానికి శ్రీకారం చుట్టడం, బడుగులపై ఆయనకు ఉన్న ప్రేమ తెలుసుకోవచ్చన్నారు. ధర్మం కేసీఆర్‌ వైపు ఉందని, ప్రజలు కేసీఆర్‌ సుపరిపాలన కోరుకుంటున్నారని, అక్రమ ఆస్తులు కూడబెట్టుకొని నీతులు మాట్లాడే ఈటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలతో మసిబుసి మారె డికాయ చేసే చందంగా వ్యవరిహరించే ఈటల తీరుకు ప్రజలు సానుభూతి చూపిస్తారని భ్రమప డడం ఉహాజనితమేనని ఎద్దేవా చేశారు. సమావేశంలో నాయకులు బండ శ్రీనివాస్‌, కొలిపాక శ్రీ నివాస్‌, కళ్లెపెల్లి రమాదేవి, సంగెం ఐలయ్య, రావు అశోక్‌ తదితరులున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈటలది ఫ్యూడల్‌ మనస్తత్వం
ఈటలది ఫ్యూడల్‌ మనస్తత్వం
ఈటలది ఫ్యూడల్‌ మనస్తత్వం

ట్రెండింగ్‌

Advertisement