e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home కరీంనగర్ ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

కలెక్టర్‌ కే శశాంక
కొత్తపల్లిలో ధాన్యం కేంద్రంఆకస్మిక తనిఖీ
పీహెచ్‌సీ సందర్శన

కొత్తపల్లి, మే 20: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెం చాలని కలెక్టర్‌ కే శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తపల్లి మండలకేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ అకస్మికంగా తనిఖీ చేశారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు పంపించాలని సూచించారు. వర్షానికి తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని రైతులను కోరారు. కొనుగోలు కేంద్రా ల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా తగిన ఏ ర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. కొనుగోలు చేసిన వడ్ల వివరాలను వెంట వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు రైతులకు రశీదులు ఇవ్వాలన్నారు. అలాగే హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా తగిన ఏర్పా ట్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదన పు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌, తహసీల్దార్‌ చిల్ల శ్రీనివాస్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎండీ ఫక్రుద్దీన్‌, బండ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనుమానితులకు పరీక్షలు చేయాలి..
కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులందరికీ ని ర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ కే శశాంక వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. పీహెచ్‌సీ పరిధిలో ఇంటింటికీ ఆరోగ్య పరీక్షల సర్వే వివరాలు, మెడికల్‌ కిట్ల పం పిణీ, వ్యాక్సినేషన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌, కరోనా నిర్ధారణ పరీక్షలు వేర్వేరుగా నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో ఓపీ సేవలు, టెస్టింగ్‌ తీరును పరిశీలించారు. సెం టర్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. మెడికల్‌ ఆఫీసర్లు గ్రామాలలో పర్యటించి లక్షణాలున్న వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. ప్రొగ్రామ్‌ ఆఫీసర్లు తమ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. పీహెచ్‌సీలో ఓపీ పరీక్షలతో పాటు సాధారణ వైద్య సేవలు, ముఖ్యంగా గర్భిణులకు నెలవారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే చామనపల్లిలో కరోనా ఓపీ సేవలను ప్రారంభించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జువేరియా, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, డాక్టర్‌ శిరీష పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

ట్రెండింగ్‌

Advertisement