ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Karimnagar - Jan 27, 2021 , 02:38:53

నింగికెగిసిన మువ్వన్నెల జెండా

నింగికెగిసిన మువ్వన్నెల జెండా

72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మానకొండూర్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మంగళవారం మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు జెండాలను ఆవిష్కరించారు.

తిమ్మాపూర్‌, జనవరి 26: ఎల్‌ఎండీ కాలనీలోని ఈఎన్‌సీ కార్యాలయంలో ఈఎన్‌సీ శంకర్‌, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో చింతల రవీందర్‌రెడ్డి, తిమ్మాపూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్‌ఐ కృష్ణారెడ్డి, ఆయా జీపీ కార్యాలయాల్లో కార్యదర్శులు, సర్పంచులు జెండాలను ఆవిష్కరించారు. ఎంపీపీ కేతిరెడ్డి వనిత, వైస్‌ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, జడ్పీటీసీ ఇనుకొండ శైలజ తదితరులు పాల్గొన్నారు. 

తిమ్మాపూర్‌ రూరల్‌, జనవరి 26: తిమ్మాపూర్‌లోని జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్‌ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ జెండాను ఆవిష్కరించారు. ఆర్టీఏ మెంబర్‌ శ్రీపతిరావు, ఎంవీఐలు గౌస్‌పాషా, నాగలక్ష్మి, మసూద్‌ ఉన్నారు. ఎల్‌ఎండీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీటీసీ ఇనుకొండ శైలజాజితేందర్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఎంపీపీ కేతిరెడ్డి వనితాదేవేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు దుండ్ర రాజయ్య, సర్పంచ్‌ జక్కని శ్రీవాణి, ఎంపీటీసీ తిరుపతిరెడ్డి, మమత ఉన్నారు.

చిగురుమామిడి, జనవరి 26 : కేడీసీసీ బ్యాంకులో మేనేజర్‌ అనిత, సింగిల్‌విండో కార్యాలయంలో చైర్మన్‌ జంగ రమణారెడ్డి, మండల ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి వసుధాభరద్వాజ్‌, జూనియర్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌ జగన్నాథరావు, ఐకేపీలో ఏపీఎం సంపత్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో ఖాజామొయినొద్దీన్‌, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ముబీన్‌అహ్మద్‌, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో రంజిత్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, కాంగ్రెస్‌, బీజేపీ కార్యాలయాల వద్ద ఆయా పార్టీల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి, లక్ష్మీనారాయణ జెండాలను ఎగురవేశారు. ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్‌, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అందె సుజాత, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, పన్యాల శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గన్నేరువరం, జనవరి 26: తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ బండి రాజేశ్వరి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో స్వాతి, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ ఆవుల తిరుపతి, పారువెల్లలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు తీగల మోహన్‌రెడ్డి, గునుకుల కొండాపూర్‌ నెహ్రూ చౌరస్తాలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు జెండాను ఎగురవేశారు. నాయకులు పాల్గొన్నారు.

శంకరపట్నం, జనవరి 26: తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీనివాసరావు, మండల పరిషత్‌, మండల వనరుల కార్యాలయాల్లో ఎంపీపీ సరోజన, వ్యవసాయ కార్యాలయంలో ఏవో శ్రీనివాస్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి షాకీర్‌అహ్మద్‌, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ రవి, తాడికల్‌ ఎస్సారెస్పీ కార్యాలయంలో డీఈఈ కవిత, ఉప మార్కెట్‌ యార్డులో వైస్‌ చైర్మన్‌ వీరాస్వామి, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం సుధాకర్‌, ఆదర్శ పాఠశాలలో హెచ్‌ఎం జ్యోతి, కేజీబీవీలో ఎస్‌వో జ్యోతి, బాలురు, బాలికల వసతిగృహాల్లో అధికారులు నాగరాజు, పద్మజ, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, పశు వైద్యాధికారులు భాగ్యలక్ష్మి, మాధవరావు, ఆయా పార్టీల నాయకులు జెండాలు ఎగుర వేశారు. జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో భీమేశ్‌ పాల్గొన్నారు. 

మానకొండూర్‌ రూరల్‌, జనవరి 26:  మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ నల్ల గోవిందరెడ్డి, పోలీస్‌ స్టేషన్‌లో సీఐ సంతోష్‌కుమార్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రాజయ్య, విద్యావనరుల కేంద్రంలో ఎంఈవో మధుసూదనాచారి, గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, కార్యదర్శులు జెండాలను ఆవిష్కరించారు. సొసైటీ డైరెక్టర్లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo